Water After Meal : భోజనం చేసిన వెంటనే నీళ్లెందుకు తాగకూడదు?

ఆయుర్వేదం ప్రకారం.. ఆహారం తిన్న వెంటనే నీరు తాగకూడదు. అలా చేస్తే.. శరీరంలో ఉండే జీర్ణరసాలు పలుచబడి జీర్ణక్రియ సవ్యంగా జరగదంట.

  • Written By:
  • Publish Date - May 22, 2024 / 07:56 PM IST

Water After Meal : మనం తినే ఆహారం జీర్ణమవ్వాలంటే.. నీళ్లు తప్పనిసరిగా తాగాలి. కానీ.. నీళ్లు తాగడానికి కూడా ఒక సమయం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి భోజనం తాగిన వెంటనే నీరు తాగకూడదంట. అందుకు కారణం కూడా అందని చెబుతోంది ఆయుర్వేదం.

ఆయుర్వేదం ప్రకారం.. ఆహారం తిన్న వెంటనే నీరు తాగకూడదు. అలా చేస్తే.. శరీరంలో ఉండే జీర్ణరసాలు పలుచబడి జీర్ణక్రియ సవ్యంగా జరగదంట. అజీర్తి వర్తి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అంతేకాదు.. భోజనం చేసిన వెంటనే నీరు తాగితే బరువు పెరుగుతారని, ఫలితంగా ఊబకాయ బాధితులవుతారని చెబుతున్నారు. సమయానికంటే ముందే ఆకలి వేసి ఆహారాన్ని కూడా అతిగా తింటారని చెబుతున్నారు.

మరి నీరెప్పుడు తాగాలని ఆలోచిస్తున్నారా ? అందుకు ఒక సమయం ఉందంట. భోజనానికి అరగంట ముందు, భోజనం చేసిన అరగంట తర్వాత నీరు తాగొచ్చని చెబుతున్నారు. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. అలాగని కూలింగ్ వాటర్ తాగితే.. జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. టాక్సిన్స్ పేరుకుని యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి.

మంచినీరే కాదు.. భోజనం చేశాక, చేస్తూ కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు. వీటిలో షుగర్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి కూడా శరీర బరువును పెంచుతాయి. అలాగే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వీలైనంత వరకూ కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండండి.