Medical Tests: ఏడాదికి ఒకసారైనా ఈ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిందే.. అవేంటంటే?

ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు

  • Written By:
  • Publish Date - April 7, 2023 / 05:00 PM IST

ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది. అంతేకాకుండా అనారోగ్యం వచ్చిన తర్వాత బాధపడడం కంటే ముందస్తుగానే జాగ్రత్తలతో సంవత్సరానికి ఒక్కసారైనా కానీ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఆరోగ్యంగా ఉండాలి అంటే రోగ నిరోధక శక్తి ని పెంపొందించుకోవాలి. మన రోగనిరోధక వ్యవస్థకు వ్యాధులను నయం చేసే శక్తి సహజంగానే ఉంటుంది. కానీ అన్నింటిని ఏదో ఒక నిరోధక వ్యవస్థను ఏం చేయలేదు.

కాబట్టి ఏడాదికి ముందస్తుగానే నిర్వహించే వైద్య పరీక్షలు ఆధారంగా తగిన చర్యలు తీసుకోవడం మంచిది. మరి ఏడాదికి ఒక్కసారైనా చేయించుకోవాల్సిన ఆ ఆరోగ్య పరీక్షలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రస్తుత కాలంలో కొలెస్ట్రాల్ రక్తపోటు అనేవీ ప్రధాన సమస్యగా మారిపోయాయి. కాబట్టి తప్పకుండా బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. అదేవిధంగా లైంగిక సంబంధాల విషయంలో చురుగ్గా ఉండేవారు ఎస్టిడి టెస్ట్ చేయించుకోవాలి. అలాగే కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ ద్వారా మహిళలు రక్తహీనత సమస్యను గుర్తించవచ్చు. మహిళల్లో నెలసరి రుతుస్రావం వల్ల హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. అందుకు తక్కువ తగిన పోషకాహారం తీసుకోకపోవడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.

అలాగే ఐరన్ తో పాటు శరీరంలో ఐరన్స్ స్టోరేజ్ ను తెలిపే సిరం ఫెర్రెటిన్ మహిళలు చేయించుకోవాల్సిన ముఖ్యమైన పరీక్షలు. అలాగే విటమిన్ డి, డి 12 కూడా ముఖ్యమైనది. ప్రస్తుత కాలంలో మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటువంటి వారు టిఎస్ హెచ్ టెస్ట్ కూడా చేయించుకోవడం అవసరం. అలాగే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్, హెచ్ బి ఏ వన్ సి టెస్ట్ చేయించుకోవడం ద్వారా మధుమేహం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వీటిని ప్రతి మూడేళ్లకు ఒకసారి 40 ఏళ్ళు వచ్చేవరకు చేయించుకోవాలి. అలాగే 40 ఏళ్లు పై బడిన వారు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కేఎఫ్ టీ , లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎల్ఎఫ్ టీ, ఈసీజీ, 2డీ ఎకో, ఛాతీ ఎక్స్ రే, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ పరీక్షలు చేయించుకోవాలి.

స్టూల్ ఒకల్ట్ బ్లడ్ టెస్ట్ ద్వారా కొలన్ కేన్సర్ ను గుర్తించొచ్చు. ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ ద్వారా ప్రొస్టేట్ కేన్సర్ ను గుర్తించొచ్చు. 40 ఏళ్లు దాటిన మహిళలు వక్షోజాల కేన్సర్ ను గుర్తించేందుకు మమ్మోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. కొలనోస్కోపీ, చెస్ట్ సీటీ స్కాన్, అబ్డామిన్ సీటీ స్కాన్ చేయించుకోవాలి. ఓవరీలు, పాంక్రియాస్, ఇంటెస్టిన్, లంగ్ కేన్సర్ కు సంబంధించి మూడేళ్లకోసారి పరీక్షలు చేయించుకోవాలి.