Video Games: మీ పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతుంటారా..? అయితే తస్మాత్ జాగ్రత్త..!!

చాలా మంది పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు. వీటివల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటోంది.

  • Written By:
  • Publish Date - October 13, 2022 / 04:47 PM IST

చాలా మంది పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు. వీటివల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటోంది. స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. ఇంకొంతమంది పిల్లలు అదే పనిగా వీడియో గేమ్స్ ఆడుతుంటారు. అలాంటి పిల్లల పట్ల వారి తల్లిదండ్రలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ చిన్నారులు డేంజర్ జోన్లో పడే అవకాశం ఉంది. తాజాగా జరుగుతున్న సంఘటనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఆసక్తి రేపే ఎన్నో గేమ్స్…అంతకుమించి ప్రమాదాన్ని తెస్తున్నాయి. ఈ వీడియో గేమమ్స్ చిన్నారుల గుండెకు ముప్పు తెస్తున్నాయంటున్నారు నిపుణులు. తాజాగా ఆస్ట్రేలియన్ పరిశోధకులు చేసిన పరిశోధనల్లో ఈ విషయం స్పష్టమైంది.

కూర్చున్న చోట గేమ్స్ ఆడుతున్నారు కదాని నిర్లక్ష్యం చేయవద్దు. వీటితో ఎలాంటి సమస్య ఉండదని అస్సలు అనుకోవద్దు. ఆట ఏదైన ఆటే కదా. అందుకే గెలుపోటములతోపాటు భావోద్వేగాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. గేమ్ లో ఓడిపోయినా…గెలిచినా…విపరీతంగా ఎగ్జియిట్ అవుతుంటారు పిల్లలు. దీంతో పిల్లల గుండెలయల్లో తేడా వస్తోంది. పర్యవసానంగా..వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నట్లు ముందుగా గుర్తించని పిల్లలకు ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. ఇలాంటి పిల్లలు వీడియో గేమ్స్‌ ఆడుతున్నప్పుడు.. ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోతుంటారనీ… అది వాళ్ల ప్రాణాలను ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరించింది.

గుండె జబ్బులున్న పిల్లలే కాదు…ఎలాంటి సమస్యలు లేని పిల్లలు కూడా ఈ వీడియో గేమ్స్ ఆడుతు గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోయినట్లు నిపుణులు చెబుతున్నారు. గేమ్స్ ఫలితాలో ఒక్కసారిగా ఉద్వేగానికి లోనవుతున్న పిల్లలు…వారి గుండెలయల్లో తేడాలు వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారని తమ స్టడీలో గుర్తించారు. ఫైర్‌ ఫెయిరీ, బ్లూ వేల్‌, గాలోన్‌ చాలెంజ్‌, చోకింగ్‌ గేమ్‌ వంటి వీడియో గేమ్స్‌లో ఆడినప్పుడు.. ఈ తరహా ప్రమాదం ఎక్కువగా ఉంటుంని నిపుణులు అంటున్నారు. అందుకే తల్లిదండ్రులు పిల్లల విషయంలో అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు.