ఈ రోజుల్లో డెస్క్ ఉద్యోగాలు చేసిన ప్రతి ఒక్కరూ కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటూ (Sitting ) గడుపుతున్నారు. అయితే ఇది ఎంత ప్రమాదకరమో చాలామంది గుర్తించడంలేదు. వైద్య నిపుణుల ప్రకారం.. స్మోకింగ్ ఎంత హానికరమో, అలానే గంటల తరబడి కూర్చోవడం కూడా శరీరానికి అంతే ప్రమాదం. నిరంతరంగా కూర్చునే అలవాటు వల్ల శరీర కండరాలు బలహీనపడతాయి, ఎముకలు నాజూగ్గా మారిపోతాయి.
Happy Birthday KL Rahul: నేడు కేఎల్ రాహుల్ పుట్టినరోజు.. రాహుల్ క్రికెట్ కెరీర్ ఇదే!
ముఖ్యంగా ఈ అలవాటు వల్ల గుండె సంబంధిత వ్యాధులు, టైప్-2 డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక జబ్బుల ముప్పు పెరుగుతుంది. అంతేకాదు కొన్నిరకాల క్యాన్సర్లకు కూడా ఇది కారణమవుతుందని పరిశోధనల ద్వారా వెల్లడైంది. దీని వల్ల జీవక్రియ కూడా మందగిస్తుంది. తద్వారా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది, ఊబకాయ సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు నిరంతరం కుర్చీలో కూర్చోవడం వల్ల వెన్ను నొప్పులు, డిస్క్ సమస్యలు కూడా తలెత్తే అవకాశముంది.
ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం సులభమే. ప్రతి 45 నిమిషాలకు ఒకసారి లేచి, కనీసం 10 నిమిషాలు నడవాలి లేదా కొద్దిగా యాక్టివ్‌గా ఉండాలి. సాధ్యమైనంతవరకు స్టాండింగ్ డెస్క్ వాడటం, ఇంటర్వెల్స్‌లో తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిది. చిన్న చిన్న మార్పులతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇకపై డెస్క్ ఉద్యోగాలు చేసినా మిడిమిడిగా కదలడం తప్పనిసరి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.