Site icon HashtagU Telugu

Smoking : స్మోకింగ్ అలవాటు మానుకోవాలనుకుంటున్నారా.. అయితే నల్ల మిరియాలతో ఇలా చేయాల్సిందే?

Do You Want To Quit Smoking... But Do You Have To Do This With Black Pepper

Do You Want To Quit Smoking... But Do You Have To Do This With Black Pepper

ధూమపానం (Smoking), మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలుసునా కూడా వాటిని అసలు మానుకోరు. ముఖ్యంగా ఈ తరం యువత చిన్న వయసులోనే వీటికి బాగా అలవాటు పడిపోయారు. స్మోక్ చేయడం స్టైల్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ధూమపానం (Smoking) చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్న విషయం తెలిసిందే. ధూమపానం చేయకూడదని ఎక్కడ చూసినా కూడా మనకు అడ్వర్టైజ్మెంట్ లు ఇస్తూనే ఉంటారు. చివరికి సిగరెట్ ప్యాక్ ల మీద కూడా అందుకు సంబంధించిన యాడ్స్ ని ఇస్తారు. అయినా కూడా వాటిని తాగడం మానుకోరు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే కొంతమంది వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకొని వాటిని మానుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎలా మానుకోవాలో తెలియక చాలామంది తెగ ఆలోచిస్తూ ఉంటారు. అయితే మీరు కూడా స్మోకింగ్ (Smoking) అలవాటుని మానుకోవాలనుకుంటున్నారా. ఈ సింపుల్ చిట్కాలు మీకోసమే. నల్ల మిరియాలతో స్మోకింగ్ అలవాటు మానుకోవచ్చట. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మిరియాలలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. పురాతన కాలం ఈ మిరియాలను కారం బదులుగా వాడుకునేవారు.

నల్ల మిరియాలు వాడడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటిని చాలా రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ నల్ల మిరియాల్లో యాంటీ ఇంప్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అల్జీమర్స్ ,మధుమేహం ,కీళ్ల నొప్పులాంటి వ్యాధులను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వడానికి, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలగడానికి అదేవిధంగా నల్ల మిరియాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ మిరియాలు ఆయుర్వేదంలో ఎన్నో సంవత్సరాలుగా వాడుతున్నారు. వీటిలో ఉన్న ఔషధ గుణాలు పెద్దలకి, పిల్లలకి చాలా బాగా ఉపయోగపడతాయి.

శరీరంలో కొలెస్ట్రాల్ అలాగే రక్తపోటు, మధుమేహం కంట్రోల్లో ఉండేలా చేస్తాయి. ప్రధానంగా ఈ నల్ల మిరియాలు స్మోకింగ్ అలవాటునుండి దూరంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది క్యాన్సర్ నీ తగ్గించి గుణాలు కూడా ఉన్నాయి.ఈ మిరియాలు పేగులలో మంటను కీళ్ల నొప్పులను చాలా బాగా తగ్గిస్తాయి. అలాగే శరీరంలో ఉన్న చెడు మలినాలను కూడా బయటికి పంపిస్తాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడతాయి.

Also Read:  Pooja : పూజ పూర్తి అయిన తర్వాత హారతి ఇవ్వడం వెనుక ఉన్న అంతర్యం ఇదే?