Mobile Phone: బాత్‌రూమ్‌లో ఫోన్ వాడుతున్నారా…? అయితే ఈ వార్త ఖ‌చ్చితంగా చ‌ద‌వాల్సిందే..!

మగవారు గంటల తరబడి టాయిలెట్‌లో కూర్చొని అక్కడ కూర్చొని ఫోన్ (Mobile Phone) వినియోగిస్తున్నారు. ఇలా చేయడం సర్వసాధారణంగా అనిపించవచ్చు.

Published By: HashtagU Telugu Desk
Right Distance Screen

Right Distance Screen

Mobile Phone: ఈ రోజుల్లో ప్ర‌జ‌లు తమ ఫోన్లను టాయిలెట్ అయినా ఎక్కడికైనా తీసుకువెళుతున్నారు. ఈ అలవాటు పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మగవారు గంటల తరబడి టాయిలెట్‌లో కూర్చొని అక్కడ కూర్చొని ఫోన్ (Mobile Phone) వినియోగిస్తున్నారు. ఇలా చేయడం సర్వసాధారణంగా అనిపించవచ్చు. కానీ టాయిలెట్‌లో ఫోన్ ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని మీకు తెలుసా..? ఇలా చేయడం వల్ల మీకెంత హానికరమో తెలుసుకోండి.

నడుము, భుజాలలో నొప్పి ఉండవచ్చు

టాయిలెట్ సీట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మీ నడుము, భుజాలు బిగుసుకుపోతాయి. దాని కారణంగా మీకు నొప్పి మొదలవుతుంది. ఇది మాత్రమే కాదు ఇది మీ శ‌రీర రూపాన్ని కూడా పాడు చేస్తుంది.

Also Read: Jagan : 45 రోజుల పాలనలో 36 రాజకీయ హత్యలు..ఢిల్లీలో ధర్నా చేస్తా: జగన్‌

సంక్రమణ ప్రమాదం

టాయిలెట్ సీటులో చాలా క్రిములు, బ్యాక్టీరియా ఉన్నాయి. మీరు బాత్‌రూమ్‌లో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు అన్ని క్రిములు, బ్యాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇది కడుపు నొప్పి, UTI (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) వంటి సమస్యలను కలిగిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

మలబద్ధకం ప్రమాదం

మరుగుదొడ్డిని సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలకు నిలయం అంటారు. మీరు టాయిలెట్‌లో కూర్చొని మొబైల్ ఫోన్‌ని ఉపయోగిస్తే ఆ బ్యాక్టీరియా మీ ఫోన్‌కు అంటుకుంటుంది. తర్వాత ఆ బ్యాక్టీరియా మీ చేతుల ద్వారా మీ నోటిలోకి ప్రవేశిస్తుంది. ఇది మలబద్ధకాన్ని కలిగిస్తుంది.

మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది

టాయిలెట్‌లో ఫోన్‌ని ఉపయోగించడం మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని ఓ పరిశోధనలో తేలింది. ఎందుకంటే ఇంతకు ముందు ప్రజలు ఏదో ఒక టాపిక్ గురించి ఆలోచించేవారు లేదా టాయిలెట్‌లో ప్లాన్‌లు వేసుకునేవారు. కానీ ఇప్పుడు ఫోన్‌ని ఉపయోగించడంలోనే సమయం అంతా వృథా చేసుకుంటున్నారు. దీని వల్ల వారి ఆలోచనా శక్తి, అర్థం చేసుకునే శక్తి తగ్గిపోతుంది.

  Last Updated: 20 Jul 2024, 12:34 AM IST