Site icon HashtagU Telugu

Headache: తరచూ తలనొప్పితో బాధపడుతున్నారా.. ఈ ఆహార పదార్థాలు అస్సలు తినకండి?

Winter Headache

Headache

ప్రస్తుత రోజుల్లో చాలామంది పని ఒత్తిడి కారణంగా, బిజీ బిజీ షెడ్యూల్ కారణంగా తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. అనవసరంగా కోపం తెచ్చుకొని తలనొప్పిని కోరి తెచ్చుకుంటూ ఉంటారు. వీటితోపాటుగా సాఫ్ట్ వేర్ జాబ్ చేసేవాళ్లు వర్క్ ఫ్రం హోం మొదలైన తర్వాత ఎక్కువ గంటలు పనిచేసి నిద్ర సరిగా లేకపోవడం వల్ల స్మార్ట్ ఫోన్ లను అతిగా ఉపయోగించడం వల్ల తలనొప్పికి గురవుతూ ఉంటారు. వీటితో పాటుగా కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కూడా తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. మరి ఎటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాలం మారిపోవడంతో ప్రస్తుత రోజుల్లో చిన్న వయసు నుంచి పెద్దవారి వరకు బీర్లు, వైన్ వంటివి తాగుతూ ఉంటారు. బీర్, మధ్యం తాగని వారు రెడ్ వైన్ తాగుతూ ఉంటారు. అయితే రెడ్ వైన్ తాగడం మంచిదే కానీ పరిమితికి నుంచి తాగడం వల్ల తలనొప్పి సమస్య వస్తుంది. ఒక గ్లాసు తాగినప్పుడు తలనొప్పిగా అనిపిస్తే వెంటనే దానిని తాగడం మానేయాలి. అలాగే యువత పిజ్జాలు బర్గర్లు పానీపూరి వంటి వాటికి బాగా ఎడిక్ట్ అయిపోయారు. చాలా వరకు బయట దొరికే వంటకాలలో చీజ్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చీజ్ తలనొప్పికి దారితీసే రక్త నాళాలు కుంచించుకుపోయేలా చేసే టైరమైన్‌ను కలిగి ఉండడంతోపాటు చీజ్ ఎక్కువగా తింటే తలనొప్పి తీవ్ర అవుతుంది.

ఒక చాక్లెట్ తినడం వల్ల మీకు తలనొప్పి రాకపోవచ్చు, కానీ 4 లేదా 5 ముక్కలు మొత్తం చాక్లెట్ తినడం వల్ల కెఫిన్ టైరమైన్ ఉన్నందున మీకు తలనొప్పి ఎక్కువ అవుతుంది. అలాగే పాలు కాఫీలు వంటి వాటిని కూడా దూరంగా ఉండాలి. పాలు అంటే పడని వారు వాటికి దూరంగా ఉండటం మంచిది. అదేవిధంగా సిట్రస్ పండ్లు తలనొప్పిని ప్రేరేపించే ఆక్టోపమైన్ అనే పదార్థాన్ని కలిగి ఉంటాయి. ఆమ్ల పండ్లను తట్టుకోలేని వ్యక్తులు తినకపోవడమే మంచిది. నారింజ, తీపి సున్నం, నిమ్మకాయలు, ద్రాక్షపండ్లతో కూడా తలనొప్పి మరింత తీవ్రం అవుతుంది.

Exit mobile version