Hot Food And Fridge: వేడి వేడి ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టి తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

ప్రస్తుత కాలంలో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫ్రిజ్ లు ఉంటున్నాయి. దీనితో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కటి కూడా

  • Written By:
  • Publish Date - July 15, 2022 / 07:30 AM IST

ప్రస్తుత కాలంలో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫ్రిజ్ లు ఉంటున్నాయి. దీనితో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కటి కూడా ఫ్రిజ్ లో పెట్టడం అలవాటు నేర్చుకున్నారు. కాయగూరలు, తినగా మిగిలిన ఆహార పదార్థాలు, పండ్లు,సరుకులు ఇలా ప్రతి ఒక్క పదార్థాన్ని ఫ్రిజ్ లో పెడుతున్నారు. ఇంకా చాలామంది మహిళలు అయితే పిల్లలను స్కూల్ కీ,భర్తలను ఆఫీస్ కి పంపించే నేపథ్యంలో వేడివేడి ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టి అది చల్లబడిన తర్వాత దానిని వారికి క్యారేజ్ ప్రతిస్తూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నది చాలా మందికి తెలియదు.

మరి వేడి వేడి ఆహారాన్ని ఫ్రిజ్ లో ఉంచడం వల్ల ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మాములుగా ఫ్రిజ్‌లో వేడి వస్తువులను పెట్టకూడదు. సైన్స్ దృక్కోణం నుండి చూస్తే ఇటువంటి వ్యవహారం రిఫ్రిజిరేటర్ పని సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇటువంటి వేడి ఆహారం ఫ్రిజ్‌పై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇలా చేయడం వలన దీర్ఘకాలంలో ఫ్రిజ్ పని చేసే సామర్థ్యం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఫ్రిజ్‌లో వేడి ఆహారాన్ని ఉంచినప్పుడల్లా అది లోపలి ఉష్ణోగ్రతను అస్తవ్యస్తం చేసి అది ఫ్రిజ్‌లో ఉన్న పదార్థాలపై ప్రభావం చూపుతుంది.

వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు ఉష్ణోగ్రతను నిర్వహించడానికి ఫ్రిజ్‌లోని కంప్రెసర్ ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ఇలా పదేపదే చేయడం వల్ల కంప్రెసర్ జీవితకాలం తగ్గిపోతుంది. అందుకే వేడివేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదని నిపుణులు చెబుతుంటారు. ఫ్రిజ్‌లోని ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది. వేడి పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు, దానిలో గాలి ఘనీభవించడం ప్రారంభమవుతుంది. ఫ్రిజ్ గోడలపై నీటి బిందువులు ఏర్పడి అక్కడున్న ఆహారంలోకి చేరుకోవడం ద్వారా తేమను పెంచుతాయి. ఈ ప్రక్రియ ఆహారం చెడిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.