Severe headache : తరచుగా తలనొప్పి వస్తుందా? అయితే దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. చాలా మందికి తలనొప్పి సర్వసాధారణంగా వస్తుంది, కానీ కొందరికి ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. తలనొప్పి రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో కొన్ని సాధారణమైనవి అయితే, మరికొన్ని తీవ్రమైనవిగా ఉంటాయి. తలనొప్పికి కారణాలు తెలుసుకుని, సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. తలనొప్పిని తగ్గించుకోవడానికి కొన్ని వ్యాయామాలు కూడా సహాయపడతాయి.
Trump Tariffs: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. ఏయే రంగాలపై ఎంత ప్రభావం?
తలనొప్పికి ప్రధాన కారణాలు. .
తలనొప్పి రావడానికి ప్రధాన కారణాలలో ఒకటి మెదడుకు రక్త ప్రసరణ సరిగా లేకపోవడం. మెదడులోని నరాలు లేదా రక్తనాళాలు కుంచించుకుపోయినప్పుడు లేదా సరిగా పనిచేయనప్పుడు, మెదడుకు ఆక్సిజన్, పోషకాలు అందవు. దీని వల్ల తలనొప్పి వస్తుంది. ముఖ్యంగా ఒత్తిడి, నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఈ సమస్యలు పెరుగుతాయి. తల, మెడ భాగంలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సరైన వ్యాయామాలు చేయడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. కొన్ని సార్లు కొన్ని యోగా ముద్రల ద్వారా కూడా తలనొప్పి కంట్రోల్ లో ఉంటుంది. తలనొప్పికి గల కారణాలు తెలిస్తే దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ పొందవచ్చు.
అలాగే, జీర్ణ సమస్యలు కూడా తలనొప్పికి ఒక కారణం కావచ్చు. మనం తినే ఆహారం సరిగా జీర్ణం కానప్పుడు, శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. ఈ విషపదార్థాలు మెదడులోని నరాలను ప్రభావితం చేస్తాయి, దానివల్ల తలనొప్పి వస్తుంది. గ్యాస్ట్రిక్, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారికి తరచుగా తలనొప్పి వస్తుంటుంది. సమయానికి సరైన ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
కంటి చూపులో మార్పులు కూడా తలనొప్పికి ఒక ప్రధాన కారణం. కంటి చూపు తగ్గడం (సైట్ పెరగడం), లేదా కంటికి ఎక్కువ ఒత్తిడి కలిగినప్పుడు తలనొప్పి వస్తుంది. ఎక్కువ సమయం కంప్యూటర్ లేదా మొబైల్ వాడే వారికి, సరిగా నిద్ర లేని వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కళ్లకు ఎక్కువ పని చెప్పడం వల్ల కంటి కండరాలు అలసిపోయి, తల భాగంలో నొప్పులకు కారణమవుతాయి. కళ్లకు విశ్రాంతి ఇవ్వడం, మంచి వెలుతురులో పనిచేయడం వంటివి పాటించాలి. అవసరమైతే కంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది.
తలనొప్పి తగ్గడానికి కొన్ని సులభమైన వ్యాయామాలు ఉన్నాయి. మెడను నెమ్మదిగా గుండ్రంగా తిప్పడం, భుజాలను పైకి కిందకు కదపడం, తలను నెమ్మదిగా పక్కకు వంచి స్ట్రెచ్ చేయడం వంటివి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే, ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇలాంటి వ్యాయామాలు 10-15 నిమిషాలు చేయడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇవి ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. అయితే, ఇలాంటి ముందుగా ట్రై చేశాక కూడా తలనొప్పి సమస్య తీవ్రంగా వేధిస్తుంటే ముందుగా డాక్టర్ సలహాతో స్కాన్స్ చేయించుకుని మెదడు పనితీరు, రక్త ప్రసరణ, నరాల బలహీనత వంటి వాటిని ముందుగా గుర్తించవచ్చును.
Bus Accident : జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి