Site icon HashtagU Telugu

Grapes : ఆకుపచ్చ ద్రాక్ష, నల్ల ద్రాక్ష.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

Do You Know Which One Is Better For Health Among Green Grapes And Black Grapes..

Do You Know Which One Is Better For Health Among Green Grapes And Black Grapes..

మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన ఆహారంతో పాటు తరచూ తాజా ఆకుకూరలు కాయగూరలు పండ్లు తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎక్కువగా ఇష్టపడే ఫ్రూట్స్ లో ద్రాక్ష కూడా ఒకటి. ఈ ద్రాక్ష మనకు ఎక్కువగా రెండు కలర్స్ లో లభిస్తూ ఉంటుంది. అందులో ఒకటి ఆకుపచ్చ ద్రాక్ష (green grapes) రెండవది నల్ల ద్రాక్ష (Black Grapes). ద్రాక్షలో ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే పచ్చ ద్రాక్ష, నల్ల ద్రాక్ష (Black Grapes) ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది? దేని వల్ల ఎక్కువ ఉపయోగాలు కలుగుతాయి అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది.. మొదట ఆకుపచ్చ ద్రాక్ష (green grapes) విషయానికి వస్తే.. ఈ ఆకుపచ్చ ద్రాక్షరసం వైన్ ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు.

We’re Now on WhatsApp. Click to Join.

ఇందులో విటమిన్ సి విటమిన్ కేతో పాటు ఫైబర్ పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇది మాత్రమే కాకుండా ఆకుపచ్చ ద్రాక్షలతో సహా అనేక యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలకం వీటిలో యాంటీ ఇ్ఫ్లమేటరీ ప్లామెట్రీ ఆంటీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి. గుండె జబ్బులు ప్రమాదం నుంచి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే నల్ల ద్రాక్ష విషయానికి వస్తే.. ఈ నల్ల ద్రాక్షని కాన్కరుడు ద్రాక్ష అని కూడా పిలుస్తారు. ఇవి రుచిలో చాలా తీపిగా ఉంటాయి. వీటిని సహజంగా జామ్, ద్రాక్షరసం వైన్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి. వీటిలో ఆంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి గుండె జబ్బులు ప్రమాదం తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ నల్ల ద్రాక్ష విటమిన్, సి విటమిన్ కి ఫైబర్ మంచి మూలంగా ఉపయోగపడుతుంది.

వీటిలో క్యాలరీలు కూడా తక్కువే బరువు తగ్గాలని అనుకునేవారు నల్ల ద్రాక్ష తీసుకోవచ్చు. ఎక్కువగా నల్ల ద్రాక్షలో సహజ చెక్కర ఉంటుంది. షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తుంది. నల్ల ద్రాక్ష ఆకుపచ్చ, ద్రాక్ష రెండు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే మీరు కేలరీల తీసుకోవడం పై శ్రద్ధ పెడితే మీరు ఆకుపచ్చ ద్రాక్షను తీసుకోవాలి. మీరు ఏ ద్రాక్షను తీసుకున్న మంచి లాభం ఉంటుంది. కానీ ఎక్కువ శాతం మంది నల్ల ద్రాక్షనే మంచిది అని అపోహ పడుతూ ఉంటారు. కానీ అలా అనుకుంటే పొరపాటు పడినట్లే. రెండు ఆరోగ్యానికి చాలా మంచివే.

Also Read:  Health Benefits: ప్రతిరోజు ఒక ఉల్లిపాయ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా?