Low Calories Food: అతి తక్కువ క్యాలరీలు ఉన్న ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.. దానివల్ల ఎన్ని లాభాలో?

సాధారణంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే అందుకోసం ప్రతిరోజు కూడా పోషకాలు ప్రోటీన్లు విటమిన్లు నిండిన

  • Written By:
  • Publish Date - September 6, 2022 / 08:10 AM IST

సాధారణంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే అందుకోసం ప్రతిరోజు కూడా పోషకాలు ప్రోటీన్లు విటమిన్లు నిండిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. కానీ రాను రాను కాలాన్ని అనుగుణంగా పోషక ఆహారాలను తినడం మానేసి జంక్ ఫుడ్ లకు, స్త్రీట్ ఫుడ్ లకు బాగా అలవాటు పడిపోయారు. తద్వారా మనిషి ఆయుష్షు కూడా తగ్గుతూ వస్తోంది. అయితే ఈ బయట దొరికే వాటిలో పోషకాల గురించి పక్కన పెడితే వాటి వల్ల వచ్చే సమస్యలే అధికంగా ఉన్నాయి. అందుకే డాక్టర్లు ప్రతిరోజు కూడా ఆకుకూరలు కాయగూరలు పండ్లను తీసుకోమని చెబుతూ ఉంటారు. వీటిలో మన శరీరాన్ని కావలసిన మినరల్స్ విటమిన్స్, లవణాలు పోషకాలు అందుతాయి.

తద్వారా మనిషి ఎంతో ఆరోగ్యంగా ఎనర్జిటిక్ గా ఉండగలుగుతారు. అయితే మనం నిత్యం వాడే కాయగూరల్లో అనేక రకాల క్యాలరీలు ఉన్నాయి. మరి కూరగాయల్లో, ఆహార పదార్థాలలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చిక్కుడుకాయలో 346 కేలరీలు ఉంటాయి. గోధుమలలో 387 కేలరీలు, మినుములలో 334 కేలరీలు, అలాగే కందులలో 360 కేలరీలు లభిస్తాయి. సోయాబీన్స్ లో 432 కేలరీలు లభిస్తాయి. తోటకూరలో 45 కేలరీలు,బీట్రూట్ 43 కేలరీలు లభిస్తాయి. కాకరకాయలో 60 కేలరీలు లభిస్తాయి.

క్యాబేజీలో 27 కేలరీలు, కాలిఫ్లవర్ లో 30 కేలరీలు, దోసలో 13 కేలరీలు, అలాగే కొబ్బరి నీరులో 24 కేలరీలు, దాక్షలో 32 కేలరీలు, బొప్పాయిలో 32 కేలరీలు మనకు లభిస్తాయి. ఇలా ఇటువంటి సరైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వాటి నుంచి వచ్చే అన్ని కేలరీలు మనకు లభిస్తాయి. తద్వారా ఎంతో ఆరోగ్యంగా హెల్దిగా ఉండవచ్చు.