Eating Food: ఉదయాన్నే పరగడుపున ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి.. ఎలాంటివి తీసుకోకూడదో తెలుసా?

  • Written By:
  • Updated On - March 5, 2024 / 01:45 PM IST

ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది సరైన ఆహారం తీసుకోక ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అంతేకాకుండా తినడానికి కూడా సమయం లేకపోవడంతో ఏది పడితే అది తిని త్వర త్వరగా పనులు చేసుకుంటూ ఉంటారు. ఇలా సరియైన ఆహారం తీసుకోలేకపోవడంతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున తీసుకునే ఆహార పదార్థాల విషయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు నిపుణులు. మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఎప్పుడు మనం తెలుసుకుందాం..

ఉదయం లేవగానే చాలామందికి బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. దీనిని నిద్ర నుంచి లేవగానే తాగుతూ ఉంటారు. ఇది అస్సలు మంచి అలవాటు కానే కాదు. దీని వలన చాతిలో మంట, డిహైడ్రేషన్ లాంటి సమస్యలు వస్తాయి. పరిగడుపున నీళ్లు తాగడం చాలా అవసరం. కానీ చల్లని నీళ్లను అసలు తాగకూడదు. దీని వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. గోరువెచ్చని నీటిని తాగడం వలన మేలు జరుగుతుంది. పరగడుపున లేచిన వెంటనే మద్యం తాగడం మరి హానికరం. ఇది నేరుగా లివర్ పై పడుతుంది. మీ బ్లడ్ లో ఆల్కహాల్ వేగంగా వ్యాపించి ఎన్నో అనారోగ్య సమస్యలకి కారణం అవుతుంది. కొంతమంది మసాలా పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినడానికి ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారు.

అయితే ఇలాంటి పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వీటి వలన కడుపులో ఆసిడిటీ లాంటి సమస్యలు వస్తాయి. ఫైబర్ కొట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం నష్టం వాటిల్లుతుంది. దాని ఫలితంగా కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం లాంటి సమస్యలు వస్తాయి. అందుకే పరిమిత మోతాల్లోనే ఫైబర్ పదార్థాలను తీసుకోవాలి. పరిగడుపున తీసుకునే ఆహారం ఎంత తేలిగ్గా ఉంటే అంత ఆరోగ్యానికి మంచిది.