Goat Let Curry in Winter Season : చలికాలం మొదలయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను చలి వణికిస్తోంది. దీంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావాలి అంటేనే సంకోచిస్తున్నారు. దీనికి తోడు చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల చాలామంది ఇంకా ఎక్కువగా సఫర్ అవుతున్నారు. మరి ముఖ్యంగా చలికాలంలో దగ్గు జలుబు జ్వరం ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. వీటితోపాటు రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. అందుకే చలికాలంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ ఉంటారు. అలాగే తీసుకునే ఆహార పదార్థాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉంటారు.
We’re now on WhatsApp. Click to Join.
చల్లని పదార్థాలు కాకుండా ఎప్పటికప్పుడు వేడివేడిగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. అయితే చలికాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో మేక కాళ్ల కూర (Goat Leg Curry) కూడా ఒకటి. ఈ రెసిపీని చలికాలంలో తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా చలికాలంలో వచ్చే చాలా రకాల వ్యాధులకు ఈ రెసిపీతో చెక్ పెట్టవచ్చు. అందుకే చలికాలంలో ఈ మేక కాళ్ళ కూరని (Goat Leg Curry) ఎక్కువగా తినమని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు.
రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని రోగకారక క్రిములను ఆక్రమించకుండా కాపాడుతుంది. ఈ రోగనిరోధక శక్తి బలంగా ఉంటే శరీరంలో ఎలాంటి సమస్యలు రావు. కానీ ఇప్పుడున్న నాసిరకం ఆహారం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడింది. బలహీనమైన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మేక పాదాల సూప్ చాలా సహాయపడుతుంది. ఎందుకంటే మేక లెగ్ సూప్‌లో అర్జినైన్ ఉంటుంది. ఇది సూక్ష్మక్రిములతో పోరాడటానికి అవసరమైన పోషకం. కాబట్టి మీరు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలనుకుంటే, తరచుగా మేక లెగ్ సూప్ తాగండి. ఈ మేక కాళ్ళతో కూర అయినా చేసుకొని తినవచ్చు లేదంటే వాడిని సూప్ లా అయినా చేసుకొని తాగవచ్చు.