Site icon HashtagU Telugu

Jaggery Water : ఉదయాన్నే బెల్లం నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Do You Know What Happens If You Drink Jaggery Water In The Morning..

Do You Know What Happens If You Drink Jaggery Water In The Morning..

Drinking Jaggery Water Early in the Morning? : కాలంతో పాటు మనుషుల ఆహారపు అలవాట్లు, జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. దాంతో మనుషులు అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ శాతం మంది చిన్న పెద్ద అని తేడా లేకుండా బాధపడుతున్న సమస్యల్లో డయాబెటిస్ సమస్య కూడా ఒకటి. అయితే డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో చాలా మంది షుగర్ కి బదులుగా బెల్లాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఎక్కువగా బెల్లం (Jaggery)తో తయారు చేసిన వంటకాలను తింటూ ఉన్నారు. బెల్లంలో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ ,కార్బోహైడ్రేట్స్, సోడియం లాంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఈ పోషకాలు మన శరీరానికి ఎంతగానో సహాయ పడతాయి.

We’re Now on WhatsApp. Click to Join.

కాగా ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో బెల్లం (Jaggery) కలుపుకొని తాగడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఈ నీటిని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. బెల్లం నీరు (Jaggery Water) తాగడం వల్ల అవి శరీర బరువును కంట్రోల్లో ఉంచుతారు. ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వారు ఉదయాన్ని బెల్లం నీటిని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. బెల్లంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి బెల్లంని గోరువెచ్చని నీటిలో వేసుకొని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బెల్లం తీసుకోవడం వలన లివర్ నుంచి విష పదార్థాలను ఈజీగా బయటికి పంపిస్తుంది. దీనిలో పోషక విలువలు ప్రభావాన్ని కలిగి ఉండే సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి.

ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో బెల్లం ముక్క లేదా బెల్లం పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆరోగ్యకరమైన నీటిని నిత్యం కాలి కడుపుతో త్రాగాలి. బెల్లం నీళ్లలో కలిపి తాగడం ఇష్టం లేకపోతే బెల్లం ముక్క తిని ఆ తర్వాత నీటిని త్రాగవచ్చు. ఉదయాన్నే వేడి నీరు తాగడం వలన పొట్ట కూడా క్లియర్ అవుతుంది. విరోచనం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా అవుతుంది. బీపీ ఎక్కువగా ఉన్న తక్కువగా ఉన్న బెల్లం నీటిని తీసుకోవాలి. ఇది బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. దీనిలో ఉన్న ఐరన్ రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. చాలామంది మలబద్ధకం సమస్యతో చాలా బాధపడుతూ ఉంటారు. నిద్రలేచిన తర్వాత కాలకృత్యాలు ముగించుకొని ఖాళీ కడుపుతో బెల్లం నీటిని త్రాగాలి. ఇలా చేస్తే ఉదయాన్నే సుఖ విరోచనం జరుగుతుంది.

Also Read:  Weight Gain Foods: బక్క పల్చగా ఉన్నానని బాధపడుతున్నారా.. ఇవి తింటే చాలు స్పీడ్ గా బరువు పెరగాల్సిందే?