Site icon HashtagU Telugu

Health Benefits: ప్రతిరోజు పచ్చిమిర్చి తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 15 Dec 2023 03 17 Pm 6339

Mixcollage 15 Dec 2023 03 17 Pm 6339

మన వంటింట్లో దొరికే కాయగూరలలో పచ్చిమిర్చి కూడా ఒకటి. ఈ పచ్చిమిర్చిని మనం అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. చాలా రకాల వంటలు పచ్చిమిర్చి లేకుండా అసలు పూర్తి కావు. చాలామంది పెరుగన్నం అలాగే ఇతర ఆహార పదార్థాలలోకి డైరెక్ట్ గా పచ్చిమిరపకాయ నంజుకొని తింటూ ఉంటారు. ఇకపోతే పచ్చిమిర్చి వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కొందరు పచ్చిమిరపకాయలు తింటే గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్యలు వస్తాయని వాటిని తినడానికి వెనకాడుతారు. పచ్చిమిర్చిలో విటమిన్ ఏ, సి, బి6 ఉంటాయి. అలాగే క్యాప్సైసిన్, కెరోటిన్, క్రిప్టోక్సంటిన్, లూటీన్ జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఇవి ఊపిరితిత్తులు, గుండె జబ్బుల నుండి రక్షిస్తాయి. అలాగే అమైనో ఆమ్లాలు, ఫోలిక్ ఆమ్లం, ఆస్కార్బిక్ ఆమ్లాలు ఇవి జీర్ణ సంబంధిత ఎంజైములను పెంచుతాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. హై బీపీ ఉన్నవారు పచ్చిమిర్చి తినడం వలన మంచి ఫలితం ఉంటుంది. పచ్చిమిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. దాని లోని సిట్రిక్ యాసిడ్ రక్తాన్ని పలుచగా చేస్తుంది. ఇది హైబీపీని నియంత్రిస్తుంది. పచ్చిమిరపకాయలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉన్నవారు అలసిపోతారు. ఇలాంటివారు ఆహారంలో పచ్చిమిర్చిని చేర్చుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.

పచ్చిమిర్చిలో విటమిన్ ఏ వంటి పోషకాలు ఉంటాయి ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది వృద్ధాప్యం నుండి రక్షిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. పచ్చిమిర్చిలో యాంటీ ఆక్సిడెంట్ లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మిరపకాయ తినడం వలన రక్తం శుభ్రం అవుతుంది. ప్రతిరోజు పచ్చిమిర్చిని తీసుకోవడం వలన రక్త ప్రసరణ సమతుల్యంగా ఉంటుంది. పచ్చిమిరపకాయల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆర్థరైటిస్ ఆస్ట్రో ఆర్థరైటిస్ రోగులకు బాగా పనిచేస్తుంది. ఇది ఎముకలలో వాపు, నొప్పిని తగ్గిస్తుంది. పచ్చిమిరపకాయలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా చేస్తుంది.