ప్రతిరోజూ రకరకాల ఆహార పదార్థాలు తింటుంటాం. వాటిలో ఆరోగ్యకర ప్రయోజనాలు అందించేవి ఉంటాయి. కానీ చాలామంది నిత్యం తినే ఆహారాల్లో అనారోగ్యకరమైన పదార్థాలు చాలా ఉంటాయి. వాటితో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వస్తుంటాయి. డయాబెటిస్, గుండెజబ్బులు, కొన్ని సందర్భాల్లో క్యాన్సర్లకు కారణం అవుతుంటాయి. కాబట్టి మనం నిత్యం తినే ఆహారాల్లో అనారోగ్యకరమైన ఏంటో తెలుసుకోవాలి.
మైదా:
పిండి వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటాం. మైదాలో కార్బొహైడ్రెట్లు, ప్రొటీన్స్ ఉండవు. మైదాతో ఎలాంటి అరోగ్య ప్రయోజనాలు ఉండవు. మైదాను తరచుగా తీసుకున్నట్లయితే జీర్ణక్రియ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
వేపుళ్లకు వాడిన ఆయిల్:
ఒకసారి వేడి చేసిన నూనెను మళ్లీ మళ్లీ పదార్థాలను వేయించేందుకు వాడుతుంటారు. ఇలా వాడిన నూనె అత్యంత ప్రమాదకరం. రోడ్డుపై చిరుతిండ్లు తినేవారు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతివంటకానికి కాచిన నూనెను వాడుతుంటారు. కాబట్టి వాటికి దూరంగా ఉంటే మంచిది.
కార్న్ పిండి:
పిండిపదార్థాలు క్రిస్పిగా వచ్చేందుకు ఈ పిండిని వాడుతుంటారు. ఇది శరీరానికి చాలా ప్రమాదకరం.
చక్కెర:
చక్కెరను పూర్తిగా మానేయకుండా…వాడకాన్ని తగ్గిస్తే మంచిది. లేదంటే ఇది కూడా విషపదార్థంగా మారుతుంది.
ఉప్పు:
ఉప్పు ఎంత తక్కువ వాడితే ఆరోగ్యానికి అంత మంచిది.
టేస్టింగ్ సాల్ట్:
బయట తినే జంక్ ఫుడ్ లో టేస్టింగ్ సాల్ట్ వేస్తేనే టేస్టింగా ఉంటాయి. ఇది శరీరానికి అత్యంత ప్రమాదకం. కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా కారణం అవుతుంది. వీలైనంత వరకు బయట తినడం మానేయాలి.