Benefits of Red Lady Finger : ఎర్ర బెండకాయలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుస్తే షాక్ అవుతారు..!!

బెండకాయ...ఆకుపచ్చని రంగులో ఉంటుంది. ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలుసు.

  • Written By:
  • Publish Date - September 11, 2022 / 10:00 AM IST

బెండకాయ…ఆకుపచ్చని రంగులో ఉంటుంది. ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలుసు. కానీ ఎరుపు రంగులో ఉండే బెండకాయ గురించి తెలుసా. ఇది ఉత్తరభారతదేశంలో చాలా ప్రసిద్ది చెందింది. ఈ ఎర్రబెండకాయ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చట. ఎర్రబెండకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ఎర్ర బెండకాయ ప్రత్యేకత ఏంటి..?
ఆకుపచ్చ బెండకాయతో పోల్చితే…ఇందులో పోషకాలు ఎక్కువ. కార్బొహైడ్రేట్లు, క్యాలరీలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, ఫైబర్ కంటెంట్, మెగ్నీషియం, విటమిన్ ఎ. విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6తోపాటు అనేక ఇతర పోషకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి.

గుండెకు మంచిది..
ఎర్రబెండకాయలో సోడియం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది గుండె కు మంచిది. ఎలాంటి సందేహం లేకుండా దీన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు. కోవిడ్ 19 వచ్చిన తర్వాత చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు వీటిని తినడం చాలా మంచిది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది..
ఎర్రబెండకాయలో మల్టివిటమిన్లు పుష్కలంగా ఉంటాయి. సహజంగా శరీరంలోని చెడు కొవ్వు పదార్థాలను క్రమంగా తగ్గిస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎర్ర బెండకాయ తీసుకోవడం చాలా ముఖ్యం.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది
ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఐరన్ కూడా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ప్రొటీన్స్ ఉండటం వల్ల శరీరానికి శక్తిని అందిస్తాయి.

జీర్ణక్రియ పెరుగుతుంది.
మానవ శరీరంలో జీవక్రియ చాలా ముఖ్యమైంది. ప్రతి క్రియాత్మక కార్యాచరణను సులభతరం చేయడానికి బాద్యత వహిస్తుంది. జీవక్రియలు సరిగ్గా పనిచేస్తేనే మనం శ్వాస పీల్చుకోగలుగుతాము. మన శరీరంలో జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఎర్రబెండకాయలోని ఐరన్ కంటెంట్, ప్రొటీన్ కంటెంట్ కారణంగా శరీరంలో జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది.