Health Tips: జున్ను తిన‌డం వ‌ల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసా?

జున్ను.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ దీనిని ఇష్టపడి తింటూ ఉంటారు. జున్ను నీ ఇష్టపడని వారు ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సి

  • Written By:
  • Publish Date - July 25, 2024 / 05:45 PM IST

జున్ను.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ దీనిని ఇష్టపడి తింటూ ఉంటారు. జున్ను నీ ఇష్టపడని వారు ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సిటీలలో ఉండే వారికి ఈ జున్ను అంతగా లభించకపోయినప్పటికీ పల్లెటూరిలో ఉండేవారికి జున్ను ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. గేదె లేదా ఆవు ప్రసవించినప్పుడు మొదటిసారిగా వచ్చే పాలతో ఈ జున్నును తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ జున్నులో పాలకంటే ఎక్కువ మోతాదులో పోషక విలువలు ఉంటాయి అన్న విషయం చాలామందికి తెలియదు. చాలామంది జున్నును తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ జున్ను వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తినకుండా అస్సలు ఉండలేరు.

మరి జున్ను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జున్ను పాలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. జున్ను లోని ప్రోటీన్ కండరాల నిర్మాణానికి, నిర్వహణకు ఎంతో అవసరం. బక్కగా, సన్నగా ఉండేవారు జున్ను తింటుంటే ఒళ్ళు చేస్తారని అంటారు. జున్ను లోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని కూడా అందిస్తాయి. జున్ను తింటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. జున్నులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల బలానికి ఎంతో దోహదపడుతుందట. అలాగే ఇందులో ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట. జున్నులో విటమిన్లు A, B12 , K ఉంటాయి.

ఖనిజాలలో పొటాషియం, మెగ్నీషియం, జింక్ కలిగి ఉంటాయి. తరచూ జున్ను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే రక్తపోటును నియంత్రిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. తరచూ జున్ను తినేవారిలో మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి పెంపొందుతుందని చెబుతున్నారు. జున్నులో సమృద్ధిగా లభించే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరికి మలబద్దకం అజీర్తి సమస్యలను తొలగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. జున్ను మంచిదే కదా అని ఎక్కువ తినడం అస్సలు మంచిది కాదు. గర్భిణీ స్త్రీలు జున్నులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలుపుకొని తింటే శిశువు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బాలింతలు పాలు సరిపడని వాళ్ళు జున్ను తింటే మంచిది. చర్మ సౌందర్యం రెట్టింపు కావాలంటే జున్ను తినాల్సిందే అంటున్నారు వైద్యులు. అలా అని మరీ ఎక్కువగా తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుకు దారితీసే అవకాశం ఉంటుంది.

Follow us