నేటికాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలి (Health benefit of dates)గడపడం చాలా ముఖ్యం. కూరగాయలు, పండ్లు, వ్యాయామం చేయడం, సమయానికి నిద్రపోవడం, తెల్లవారుజామునే మేల్కోవడం ఇలాంటి కొన్ని జీవనశైలి మార్పులు..మిమ్మల్ని ఆరోగ్యకరమైన, ఒత్తిడిలేని జీవితాన్ని ఇస్తాయి. అందులో ఒకటి ఖర్జూర.అవును ఖర్జూరను (Health benefit of dates) ప్రతిరోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా పరగడుపున రెండు ఖర్జూరలను తింటే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు కూడా సూచిస్తున్నారు.
ఖర్జూరాను రాత్రంతా నీటిలో నానాబెట్టి.. మరుసటి రోజు ఉదయం తినవచ్చు. లేదంటే నానాబెట్టకున్నా పచ్చిగా తినవచ్చు. అది మీ ఇష్టం . కానీ ప్రతిరోజూ ఖర్జూరను తినడం దినచర్యలో భాగం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే వారికి ఇఫ్తార్‌లో ఖర్జూరం ఉంటుంది. ఈ రోజు మనం నానబెట్టిన ఖర్జూరాన్ని రోజూ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ దీక్షా భావ్‌సర్ ఈ సమాచారాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఆహారంలో తప్పనిసరిగా ఖర్జూరాను చేర్చుకోవాలని సలహాఇస్తున్నారు.
ఖర్జూరం తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ ప్రయోజనాలను తెలుసుకుందాం..
-ఇది మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.
-గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
-ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
-ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
-రక్తపోటును నియంత్రిస్తుంది.
-స్త్రీ పురుషులిద్దరిలో లైంగిక శక్తిని పెంచుతుంది.
-మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది
-అలసట (బలహీనత) నుండి ఉపశమనం పొందుతుంది.
-రక్తహీనతకు ఉత్తమమైనది.
-ఆరోగ్యకరమైన బరువు పెరుగుటను ప్రోత్సహిస్తుంది.
-పైల్స్‌ను నివారిస్తుంది.
-వాపును నివారిస్తుంది.
-ఆరోగ్యకరమైన గర్భధారణకు ఉత్తమమైనది.
-మీ చర్మం, జుట్టుకు ఉత్తమమైనది.
ఒకవేళ మీరు బరువు పెరగాలనుకుంటే రోజుకు నాలుగు ఖర్జూరాలను తినవచ్చు.
నానాబెట్టిన డేట్స్ ఎందుకు తినాలి?
నానబెట్టడం వల్ల వాటిలో ఉండే టానిన్లు/ఫైటిక్ యాసిడ్‌లు విడుదలవుతాయి, వాటి నుండి పోషకాలను మనం సులభంగా గ్రహించేలా చేస్తుంది. నానబెట్టడం వాటిని చిన్నగా చేస్తుంది, ఇది సులభంగా జీర్ణమవుతుంది. కాబట్టి మీరు ఖర్జూరం యొక్క పూర్తి ప్రయోజనాలను పొందాలనుకుంటే, వాటిని తినే ముందు రాత్రంతా (8-10 గంటలు) నానబెట్టండి.
పిల్లల ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఖర్జూరాలు ఉత్తమమైనవి. తక్కువ బరువు, తక్కువ హిమోగ్లోబిన్ (ఇనుము) బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి రోజుకు ఒక తీపి ఖర్జూరం తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది 2-3 నెలల వరకు ఉండవచ్చు. ఖర్జూరాలు వేడిగా ఉండవు కానీ చాలా చల్లగా ఉంటాయని, అన్ని పిత్త వ్యాధులకు ఉత్తమంగా పనిచేస్తాయని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.