Health Benefits Of Raw Potato : బంగాళదుంప రసం పచ్చిగా తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?

నేటికాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. చిన్నా పెద్దా లేకుండా వ్యాధులతో బాధపడుతున్నారు.

  • Written By:
  • Publish Date - September 9, 2022 / 08:00 AM IST

నేటికాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. చిన్నా పెద్దా లేకుండా వ్యాధులతో బాధపడుతున్నారు. ఒకప్పుడు 60ఏళ్లు నిండిన వాళ్లకే మోకాల నొప్పులు వచ్చేవి..కానీ ఇప్పుడు 20 ఏళ్లకు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దీనంతంటి కారణం మన జీవన విధానం. మనం తీసుకునే ఆహారం. శరీరంలో రోగనిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు రోగాలన్నీ చుట్టుముడుతాయి. వీటన్నింటికి తోడు బీపీ, షుగర్ వంటి రకరకాల జబ్బులు ఒకసారి వచ్చాయంటే జీవితంతా వాటితో జీవించాల్సిందే. ఈ సమస్యల నుంచి విముక్తి పొందాలంటే మనం తీసుకునే ఆహారంలో చిన్నపాటి మార్పులు చేసుకోవాలి. వీలైనంత వరకు నేచురల్ రెమెడీస్ పాటించడం చాలా ముఖ్యం. బంగాళుదంప రసం పచ్చిగా తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.

కండరాల నొప్పి నుంచి ఉపశమనం:
ఈరోజుల్లో చాలా మంది ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. వయస్సు పెరిగే కొద్దీ చాలామంది ఈ సమస్య ఎదురువుతుంది. ఎముకలు, కీళ్లకు సంబంధించిన నొప్పి, వాపు సహజంగా ఉంటుంది. కాళ్లు, చేతులు కదలువ, మోకాలు, భుజం , మెడ, వీపు నొప్పితోపాటు మంట కలుగుతుంది. ఈ సమస్యకు సరైన మందులు తీసుకుంటే పరిష్కారం లభిస్తుంది.

ఇంగ్లీష్ మెడిసన్ పై ఆధారపడకుండా ఇంట్లోనే బంగాళదుంప రసాన్ని ఈజీగా తయారుచేసుకుని తాగవచ్చు. కీళ్లనొప్పులకు బంగాళదుంప దివ్యౌషధం. ముఖ్యంగా చలికాం, వర్షాకాలంలో ఇది నొప్పికి గొప్ప నివారిణిగా పనిచేస్తుంది.

జీర్ణశక్తి పెరుగుతుంది:
కొంతమంది ఏదో తెలియన సమస్య వల్ల సతమతమవుతుంటారు. వారి శరీరంలో ఏం జరుగుతుందో అర్థం కాదు. దీని కారణంగా సరిగ్గా సమయానికి తినరు. అలాంటప్పుడు జీర్ణశక్తి బలహీనపడుతుంది. దీంతో శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగతుంది. రక్తప్రసరణ సరిగ్గా లేకుంటే ఎముకలు, కీళ్లలో నొప్పి వస్తుంది.

సరైన ఆక్షిజన్, పోషకాల సరఫరా లేకపోవడం వల్ల కూడా కణాలు బలహీనంగా మారుతాయి. ఒక గ్లాసు బంగాళదుప రసం తాగడం వల్ల శరీరంలో జీర్ణశక్తిని పెంచుతుంది. అంతేకాదు రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది.

pHస్థాయి కంట్రోల్లో ఉంటుంది:
మనశరీరంలో pH స్థాయి అనేది ఎప్పుడూ కంట్రోల్లోనే ఉంటుంది. కానీ మన ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, అధికంగా మందులు వాడటం ఇవన్నీ కూడా శరీరంలో pHస్థాయిని మారుస్తుంటాయి. అందుకే ఆల్కలీన్ కలిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. పచ్చిబంగాళదుంప రసంలో సహజ ఆల్కలీన్ ఉంటుంది. ఇది pHస్థాయిని సమతుల్యం చేస్తుంది.

యూరిక్ యాసిడ్ ను బయటకు పంపుతుంది:
శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు గౌట్ సమస్యకు దారి తీస్తుంది. ఈ పరిస్థితి ఉన్నవాళ్లు కీళ్లలో విపరీతమైన నొప్పిని అనుభవిస్తుంటారు. కీళ్ల చుట్టూ చర్మం వాపు, ఎర్రబడుతుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడంతో శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. కానీ బంగాళదుంప రసం అలాంటి సమస్యలను దూరం చేస్తుంది. బంగాళదుంప రసం శరీరం నుంచి యూరిక్ యాసిడ్ ను బయటకు పంపడంలో, గౌట్ సమస్యను నయం చేయడంలో చాలా మంచిది.

గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ పెడుతుంది.
ఎసిడిటి, కడుబు ఉబ్బసం,అలసట, అజీర్తి ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ సమస్యల లక్షణాలు. బంగాళదుంప రసం తాగితే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల బంగాళదుంప రసం తాగడం వల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:
బంగాళదుంపలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం నుంచి అదనపు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. బంగాళదుంప జీరో కొలెస్ట్రాల్ ఉన్న ఆహార పదార్థం. అందుకే గుండెకు, రక్తనాళాలకు ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

 టాక్సిన్స్ ను తొలగిస్తుంది:
మనిషి శరీరంలో విషపదార్థాలు ఉంటే కీళ్లనొప్పులు, ఎముకల నొప్పులు పెరుగుతుంటాయి. వీటిని వదిలించుకోవడానికి ముందుగా శరీరం అంతర్గతంగా శుభ్రంగా ఉండాలి. బంగాళదుంప రసం తాగడం వల్ల శరీరంలో ట్యాక్సిన్ తొలగిపోతాయి. అవయవాలు శుభ్రంగా ఉంటాయి. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. ఈ రసాన్ని సులభంగా తయారుచేసుకోవచ్చు. మిక్సర్ జార్ లో బంగాళదుంప ముక్కలను వేసి నీళ్లు పోసి బ్లెండ్ చేసుకోవాలి. రుచిగా ఉండాలంటే క్యారెట్ కానీ బీట్ రూట్ కూడా కలుపుకోవచ్చు.