Beer Health Benefits : బీరు ప్రయోజనాలు తెలిస్తే చేతులెత్తి దండం పెడతారు..!!

ప్రతిరోజూ ఆల్కాహాల్ సేవిస్తే..ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో అందరికీ తెలిసిందే. బరువు పెరగడంతోపాటు..ఊబకాయం సమస్య కూడా బాధిస్తుంది. అందుకే బీర్ తాగడానికి చాలా మంది ఇష్టపడరు.

  • Written By:
  • Publish Date - June 23, 2022 / 11:00 AM IST

ప్రతిరోజూ ఆల్కాహాల్ సేవిస్తే..ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో అందరికీ తెలిసిందే. బరువు పెరగడంతోపాటు..ఊబకాయం సమస్య కూడా బాధిస్తుంది. అందుకే బీర్ తాగడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే బీర్ తాగితే మాత్రం కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలంలో చల్లని బీర్ తాగేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. మండుతున్న ఎండలకు …చల్లని బీర్ ఎంతో ఉపశమనాన్ని ఇస్తుందని కొందరు అభిప్రాయపడుతుంటారు. అయితే బీర్ తాగుతే…బరువు, ఊబకాయం వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ బీర్ వల్ల మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చట. ఎలాగో చూద్దాం.

డయాబెటిస్:
బీర్ లో పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది షుగర్ ను కంట్రోల్లో ఉంచేందుకు సాయం చేస్తుంది. మెడిటరేనియన్ డైట్ తో కలిపిన చిన్న పరిమాణంలో బీర్ మధుమేహం, రక్తపోటుతో పోరాడేందుకు సాయపడుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు.

గుండె ఆరోగ్యంగా ఉండేందుకు:
గుండెకు బీర్ మేలు చేస్తుందా…వినడానికి విచిత్రంగా ఉన్నా…నిజంగానే మేలు చేస్తుందట. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నిపుణులు చేసిన ఓ పరిశోధన ప్రకారం…వారానికి ఆరు పింట్ల కంటే తక్కువ మీడియం స్ట్రాంగ్ బీర్ తాగితే…గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చట. ఒక చిన్న గ్లాస్ బీరు తాగితే గుండెపోటు ప్రమాదాన్ని దాదాపు 50శాతం తగ్గించవచ్చట.

క్యాన్సర్ కు ఔషధం లాంటిది :
బీర్ క్యాన్సర్ కణాలను చంపుతుందా..అవును నిజమే. కాలేయం, పెద్దప్రేగు క్యాన్సర్ కణాలను అడ్డుకోగల సత్తా బీర్ కు ఉందట.

సుదీర్ఘజీవితం :
టెక్సాస్ అధ్యయనం ప్రకారం..మితమైన మద్యపానం అన్ని కారణాల నుంచి ముందస్తు మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుందట. హాలండ్ లో 5500మంది వ్యక్తులతో జరిపిన పరిశోధనలో ప్రతిరోజూ పింట్ బీర్ తాగితే ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారని వెల్లడించారు.

కాలేయం భద్రత:
బీర్ లో ఉండే క్శాంతోహోమోల్ కాలేయానికి మేలు చేస్తుంది. అయితే అధికంగా ఆల్కాహల్ సేవిస్తే కొవ్వు కాలేయ వ్యాధికి కారణం అవుతుంది. కానీ తక్కువ పరిమాణంలో బీర్ తాగినట్లయితే కాలేయానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.