Health Benefits: చలికాలంలో పెరుగు తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

పెరుగు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. చాలామందికి పెరుగు లేనిది ముద్ద కూడా దిగదు. రోజుకీ కనీసం ఒక్కసారి

Published By: HashtagU Telugu Desk
Mixcollage 18 Dec 2023 07 55 Pm 7937

Mixcollage 18 Dec 2023 07 55 Pm 7937

పెరుగు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. చాలామందికి పెరుగు లేనిది ముద్ద కూడా దిగదు. రోజుకీ కనీసం ఒక్కసారి అయినా పెరుగు తినందే చాలా మందికి అన్నం తిన్నట్టు కూడా ఉండదు. అయితే ప్రస్తుతం చలికాలం. మరి చలికాలంలో పెరుగు తినవచ్చా. తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..చలికాలంలో పెరుగు తినవచ్చు అంటున్నారు వైద్యులు. చలికాలంలో పెరుగు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు. చలికాలంలో పెరుగు తీసుకోవడం వలన మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగు లోని ఎన్నో పోషకాలు మీ శరీరానికి చలిని తట్టుకునే సామర్థ్యాన్ని కూడా కల్పిస్తూ ఉంటాయి.

అలాగే ఆహారం తొందరగా జీర్ణం అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. శీతాకాలంలో మీ ఆహారంలో పెరుగుని చేర్చుకోవడం వలన మీ చర్మం మెరుస్తూ ఉంటుంది. పెరుగులో ఉన్న మార్చ్ రైజింగ్ లక్షణాలు ముఖాన్ని కాంతివంతంగా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే బ్లాక్ హెడ్స్ ని తగ్గించడంలో కూడా పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీ చర్మం మచ్చలేనిదిగా మార్చడమే కాక దానిని మెరిసేలా చేస్తూ ఉంటుంది.
అలాగే శీతాకాలంలో చర్మం తరచుగా పొడిబారటం వలన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితిని తగ్గించేందుకు మీరు పెరుగు తీసుకోవచ్చు. దీనిలో విటమిన్ సి పొటాషియం మెగ్నీషియం ప్రోటీన్ లాంటి అనేక పోషకాలు కలిగి ఉంటుంది. ఇది శీతాకాలంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది.

చలికాలంలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలతో ఎముకల నొప్పి ఉంటుంది చలికాలం కారణంగా ఎముకలు ఎన్ను నొప్పి చాలా అధికంగానే ఉంటుంది. ఆ పరిస్థితిని తగ్గించుకోవడానికి పెరుగు ని తీసుకోవచ్చు. దీనిలో ఉండే కాల్షియం ఎముకలని గట్టిపరుస్తుంది. ఇంకా ఎముకల నొప్పులు కూడా తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. పెరుగుని తీసుకోవడం వల్ల ఎముకల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. చాలామందికి ఉండే కొన్ని చెడు ఆహారపు అలవాట్లు వల్ల వాళ్లకి జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఆహారపు అలవాట్ల ఎఫెక్ట్ ఎక్కువగా పడుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో శరీరం యొక్క పీహెచ్ లెవెల్స్ ని కూడా అధికమవుతూ ఉంటాయి. ఇంకా దీని ఎఫెక్ట్ మానవజీ అన్నయ వ్యవస్థ మీద కూడా పడుతుంది. మీరు మీ జీర్ణ శక్తిని క్రమబద్ధీకరించాలనుకుంటే మీరు పెరుగు తీసుకోవాలి.

  Last Updated: 18 Dec 2023, 07:55 PM IST