Mushroom Benefits : పుట్టగొడుగు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

పల్లెటూర్లలో వాళ్ళు పొలం గట్లపై ఉన్న పుట్టగొడుగులను (Mushroom) తెచ్చుకొని తింటే, సిటీలలో ఉండేవారు సూపర్ మార్కెట్లో కూరగాయల బజార్లలో తెచ్చుకుని తింటూ ఉంటారు..

Published By: HashtagU Telugu Desk
Mushroom Benefits

Do You Know The Benefits Of Mushroom..

Benefits of eating Mushroom : ఇటీవల కాలంలో పుట్టగొడుగుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో మనకు మార్కెట్ లో ఏడాది పొడవునా ఈ పుట్టగొడుగులు (Mushroom) లభిస్తూనే ఉన్నాయి. అయితే పల్లెటూర్లలో వాళ్ళు పొలం గట్లపై ఉన్న పుట్టగొడుగులను తెచ్చుకొని తింటే, సిటీలలో ఉండేవారు సూపర్ మార్కెట్లో కూరగాయల బజార్లలో తెచ్చుకుని తింటూ ఉంటారు.. అయితే ఈ పుట్టగొడుగుల (Mushroom) వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇవి కాస్త జిగురుగా ఉంటాయి అని చాలామంది వీటిని తినడానికి అసలు ఇష్టపడరు.

We’re now on WhatsApp. Click to Join.

కానీ వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తినకుండా అస్సలు వదలరు. మరి పుట్టగొడుగుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే.. పుట్టగొడుగులు శరీరంలో రక్తాన్ని పెరిగేలా చేస్తాయి. రక్తం తక్కువగా ఉన్నవారు పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల రక్తం పెరుగుతుంది. అలాగే పుట్టగొడుగులలో పోలిక్ యాసిడ్ ఐరన్ తగిన మోతాదులో ఉంటుంది. బరువు తగ్గడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పుట్ట గొడుగులలో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉండటం వలన బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని ఆహారంలో యాడ్ చేసుకోవడం వలన అజీర్ణం, మలబద్ధకం లాంటి సంబంధిత సమస్యలు అన్ని తగ్గిపోతాయి.

పుట్టగొడుగులతో తయారైన ఆహారం నాలుకకు రుచిగా అందించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ఉపయోగాలని కూడా అందిస్తుంది. దీనిలో ముఖ్యమైన ఉపయోగకరమైన పోషకాలు అనేకం ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇంకా వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా సేపు కడుపు నిండుగా అనిపిస్తుంది. కావున త్వరగా ఆకలివేయదు.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పుట్టగొడుగులలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బయాటిక్ గుణాలు ఉన్నాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. పుట్టగొడుగులలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ పుష్యకలంగా ఉంటాయి.

పుట్టగొడుగులను ఆయుర్వేదంలో కూడా బాగా వినియోగిస్తూ ఉంటారు. పుట్టగొడుగులు తీసుకోవడం వలన ఎన్నో వ్యాధులు తగ్గిపోతాయి..

Also Read:  Brushing: మీరు బ్రష్ చేసేటప్పుడు ఇలా జరుగుతుందా..? వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిందే..!

  Last Updated: 26 Dec 2023, 02:54 PM IST