Site icon HashtagU Telugu

Jaggery Benefits : చలికాలంలో బెల్లం తింటే ఎన్ని లాభాలో తెలుసా..!!

Jaggery Tea

Tea Jaggery

పంచదార కంటే బెల్లం మంచిది. బెల్లంతో తయారు చేసే వంటకాలు రుచిగా ఉంటాయి. శీతాకాలంలో బెల్లం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బెల్లం సహజమైన తీపిని కలిగి ఉంటుంది. అందుకే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతుంటారు. బెల్లంలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఎలాంటి రసాయనాలు ఉండవు. కాబట్టి బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. మరి చలికాలంలో బెల్లం తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం.

1. మధుమేహ వ్యాధిగ్రస్తులు చక్కెరకు బదులుగా బెల్లం తింటే మంచిది. ప్రపంచవ్యాప్తంగా బెల్లం ఉత్పత్తిలో 70శాతం భారత్ లో ఉత్పత్తి అవుతుంది. రోజూ మీ ఆహారంలో బెల్లంను చేర్చుకుంటే అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు.

2. మహిళలు బెల్లం తినడం వల్ల అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలను ఆశించవచ్చు. బహిష్టు సమయంలో స్త్రీలు అనుభవించే పొత్తికడుపు నొప్పి,మూడ్ స్వింగ్స్, కడుపులో తిమ్మిర్లు, వీటిన్నింటిని బెల్లం ద్వారా పరిష్కరించవచ్చు. బెల్లం తినే అలవాటు ఉన్నవారి శరీరంలో మంచి హర్మోన్లను విడుదల చేసి శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.

3. శరీరాన్ని శుభ్రంచేసే గుణం బెల్లానికి ఉంది. బెల్లం తినడం వల్ల ఊపిరితిత్తులు, కడుపు, ప్రేగులు, శ్వాసకోశ అంతర్గతం శుభ్రపడుతుంది.

4. అధికరక్తపోటు, గుండెజబ్బులు ఉన్నవారు బెల్లం తింటే మంచిది. ఎందుకంటే బెల్లం మన గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల మనశరీరంలో కండరాలకు బలం ఇస్తుంది.

5. బెల్లంలో మెగ్నీషియం ఉంటుది. ఇది నాడీ వ్యవస్థకు కలిగే హానిని నివారిస్తుంది. అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది.

6. రోజుకు 2 టేబుల్ స్పూన్ల బెల్లం తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version