Health Tips: కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే…వారానికి ఒక్కసారైనా చేపలు తినాల్సిందే…!!

నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే...పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాల్సిందే. పోషకాలు ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, తాజా కూరగాయలు, ఆకుకూరలు, ఇలా అన్నింటిలోనూ సరైన మోతాదులో తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం.

  • Written By:
  • Publish Date - August 29, 2022 / 08:45 AM IST

నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే…పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాల్సిందే. పోషకాలు ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, తాజా కూరగాయలు, ఆకుకూరలు, ఇలా అన్నింటిలోనూ సరైన మోతాదులో తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. కానీ నేటికాలంలో ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్…వీటికి అలవాటు పడి రకరకాల రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. అందుకే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని…పోషకాహారమే తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించే ఆహారాల్లో ముఖ్యమైనవి చేపలు. వీటిలో ఉండే పోషకాలు రకరకాల రోగాల నుంచి విముక్తి కలిగించడంతోపాటుగా ఆరోగ్యంగా ఉంచుతాయి.

కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభించాలంటే…వారానికి ఒక్కసారైనా చేపలు తినాలని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. చేపలు తినడం వల్ల ఎన్నో రకాలు ప్రయోజనాలున్నాయి. వారానికి ఒకసారి చేపలు తింటే రుమటాయిడ్, ఆర్థ్రరైటిస్ వంటి కీళ్లనొప్పుల ముప్పును తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 32వేల మంది మహిళలపై అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు పరిశోధకులు. ఒమేగా 3 కొవ్వు అమ్లాలు ఎక్కువగా తీసుకునే వారిలో కీళ్లనొప్పుల ముప్పు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

ట్యూనా, సాల్మోన్ చేపల్లో అధికంగా ఈ ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు లభ్యమవుతాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న మహిళల్లో 27శాతం మంది కొవ్వు ఆమ్లాలను తీసుకున్నట్లు గుర్తించారు. మొత్తంగా కీళ్లనొప్పులకు ఎక్కువగా గురయ్యే మహిళలు వారానికి ఒకసారి చేపలను తినాలని పరిశోధకులు చెబుతున్నారు.