Site icon HashtagU Telugu

Amla Benefits : చలికాలంలో ఉసిరికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Do You Know The Benefits Of Eating Amla In Winter..

Do You Know The Benefits Of Eating Amla In Winter..

Benefits of Eating Amla : చలికాలం మొదలయింది అంటే చాలు అనేక రకాల ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. అయితే ఈ ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మెరుగ్గా ఉండాల్సిందే. ఇందుకోసం మనం చలికాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. అలా చలికాలం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో ఉసిరికాయ (Amla) కూడా ఒకటి. చలికాలంలో ఉసిరికాయ (Amla) తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే చలికాలంలో తరచూ జీర్ణ సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఉసిరి తీసుకోవడం చాలా మంచిది. ఉసిరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ప్రేగు కదలికలు సక్రమంగా జరిగి మలబద్దకం దూరమవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

జీర్ణ వ్యవస్థ నుండి టాక్సిన్స్ దూరమవుతాయి. ఉసిరిలో విటమిన్ సి, యాసిడ్ పాలిఫెనాల్స్, ఫ్లేవనయిడ్స్ సహా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపుని తగ్గించేందుకు ఉసిరి హెల్ప్ చేస్తుంది. ఉసిరిలో ఒత్తిడిని దూరం చేసే గుణాలు ఉన్నాయి. చల్లని వాతావరణం, పర్యావరణ మార్పుల కారణంగా వచ్చే ఒత్తిడిని దూరం చేసి ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉసిరి బాగా పనిచేస్తుంది..ఉసిరిలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఇమ్యూనిటీ పెరిగి అంటువ్యాధులు, అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. దీనిని తీసుకుంటే తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. సాధారణ జలుబు, ఫ్లూ, సీజనల్ సమస్యల్ని దూరం చేయడంలో ఉసిరి హెల్ప్ చేస్తుంది. చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే చర్మం, జుట్టుపై ఎఫెక్ట్ పడుతుంది. అయితే, ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తి పెంచుతుంది. చర్మాన్ని మెరుగ్గా చేస్తుంది. దీనిని మన డైట్‌లో చేర్చుకుంటే హెల్దీ స్కిన్ మీ సొంతమవుతుంది. చర్మ సమస్యల్ని దూరం చేయడంలో ఉసిరి బాగా పనిచేస్తుంది. దీంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడి, చుండ్రుని దూరం చేస్తుంది. చలికాలంలో ఉసిరి అలానే తినవచ్చు. లేదా సలాడ్, రసం చేసి తసీుకోవచ్చు. ఉసిరిని పచ్చడిలా కూడా చేయవచ్చు. ఉసిరి మురబ్బాలా కూడా చేయవచ్చు. దీని వల్ల ఇమ్యూనిటీ పెరగడం దగ్గర నుంచి ఆరోగ్య, అందానకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

Also Read:  Breath Underwater : ఊపిరి బిగబట్టుకొని నీళ్లలో 5 నిమిషాలు ఈత కొట్టగలరు.. ‘సమా బజౌ’ తెగ విశేషాలు