Winter Foods : చలికాలంలో టొమాటో సూప్ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

  • Written By:
  • Updated On - November 28, 2022 / 06:18 PM IST

శీతాకాలంలో మన మనస్సు వెచ్చదనాన్ని కోరుకుంటుంది. ఎలాంటి ఆహారం తిన్నా వేడి వేడిగా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా వేడి చాయ్, కాఫీ పదే పదే తాగాలనిపిస్తుంది. కానీ వీటిని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం కాబట్టి సూప్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం చాలా బెటర్. సూప్ శరీరానికి వేడి అనుభూతిని కలిగించడంతోపాటు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చలికాలంలో పలు రకాల కూరగాయలతో సూప్స్ తయారు చేసుకోవచ్చు. వాటిలో టమోటా సూప్ చాలా ఫేమస్. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ దీన్ని ఇష్టంగా లాగిస్తుంటారు. టమోటా సూప్ అద్భుతమైన రుచిని కలిగి ఉంటుది. చలికాలంలో టమోటా సూప్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అనారోగ్యం నుంచి రక్షణ:
చలికాలంలో చాలామంది అనారోగ్యం పాలవుతుంటారు. ముఖ్యంగా జలుబు, దగ్గు చాలా వేధిస్తుంటుంది. చలికాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అయితే టమాటో సూప్ ను మీ ఆహారంలో చేర్చుకున్నట్లయితే..ఇది ఎంతో ఉపశమాన్ని ఇస్తుంది. టమోటాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది. బ్యాక్టీరియాతో పోరాడే శక్తిని కూడా ఇస్తుంది. టమోటా సూప్ ను క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

శరీర ఉష్ణోగ్రత:
చలికాలంలో చలిగాలుల వల్ల శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులకు గురవుతుంది. జలుబుతో బాధపడేవారు…తమ శరీరాన్ని వేడిగా ఉంచుకునేందుకు టీ, కాఫీలను తీసుకుంటారు. కానీ అది మన శరీరాన్ని కొంత సమయం మాత్రమే వెచ్చగా ఉంచుతుంది. టమోటో సూప్ తీసుకోవడం వల్ల మన శరీరాన్ని వెచ్చగా ఉంచడతోపాటు డీహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

బరువు నియంత్రణకు టమోటా సూప్:
చలికాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంతో చాలా మంది ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటారు. చలి కారణంగా ఎక్సర్ సైజ్ చేయలేకపోతారు. ఇది బరువు పెరిగేందుకు దారి తీస్తుంది. చలికాలంలో బరువును అదుపులో ఉంచుకునేందుకు టమాటో సూప్ తాగాలి. ఇది బరువును అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. టమోటా సూప్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే పీచు పదార్థం నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.

శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది:
శీతాకాలంలో టొమాటో సూప్ తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. శరీరంలో విషపూరిత అంశాలు పేరుకుపోతాయి. అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. ఈ రెండు సమస్యలకు టొమాటో సూప్ చక్కని పరిష్కారం లబిస్తుంది. . టొమాటో సూప్‌లో ఉండే నీరు శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇది UTI నుండి కూడా రక్షిస్తుంది. అంతేకాదు టొమాటోలోని పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.