Black tea: బ్లాక్ టీ ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

గ్రీన్ టీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే గ్రీన్ టీ తాగాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు.

  • Written By:
  • Updated On - September 16, 2022 / 07:39 PM IST

గ్రీన్ టీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే గ్రీన్ టీ తాగాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, కెఫిన్, యాంటీ-ఆక్సిడెంట్లు, అమైనో యాసిడ్‌లు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటులో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం…మీరు రోజుకు రెండుసార్లు గ్రీన్ టీని తీసుకోవచ్చు. గ్రీన్ టీ కాకుండా బ్లాక్ టీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ టీ తాగడం వల్ల శరీరంపై మంచి ప్రభావం ఉంటుంది. మారుతున్న వాతావరణం వల్ల కలిగే సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ సీజన్ లో అసాధారణ ఉష్ణోగ్రత వల్ల జలుబు, దగ్గు, జ్వరం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే బ్లాక్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది:
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బలహీనమైన రోగనిరోధక శక్తి అనారోగ్యం బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే బ్లాక్ టీ యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఈ టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఈ బ్లాక్ టీలో ఉండే కెఫిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు శరీరంలో శక్తి ప్రసరణకు ఎంతో సాయపడుతుది. ఇందుకోసం ప్రతిరోజూ ఉదయం పూట బ్లాక్ టీ తాగడం ఎంతో మంచిది నిపుణులు చెబుతున్నారు.

క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ:
బ్లాక్ టీ తాగడం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌సీఐ) పరిశోధనలో వెల్లడైంది. బ్లాక్ టీ పాలీఫెనాల్స్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి కణితి పెరుగుదల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మం, రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

గుండెకు మేలు చేస్తుంది:
బ్లాక్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు (ఫ్లేవనాయిడ్స్ అని పిలుస్తారు) గుండెకు ఎంతో మేలు చేస్తాయి. బ్లాక్ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది అధిక రక్తపోటు,కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో బ్లాక్ టీ తాగడం ఎంతో మంచిది.