Guava Leaf Juice : జామ ఆకుల రసం తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

జామపండు (Guava) వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. జామ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - November 22, 2023 / 04:20 PM IST

Guava Leaf Juice : జామపండు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. జామ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దాంతో పాటు ఇంకా ఎన్నో రకాల పోషకాలు కూడా జామలో ఉన్నాయి. అందుకే జామకాయను పేదవాడి యాపిల్ అని పిలుస్తారు. జామ పండు ఎన్నో రకాల వ్యాధులకు గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. అయితే కేవలం జామపండు మాత్రమే కాకుండా జామ ఆకులు (Guava Leaf) కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మరి ముఖ్యంగా జామ ఆకుల రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది.

We’re Now on WhatsApp. Click to Join.

జామ ఆకుల రసంలో ఎన్నో పోషక గుణాలు ఉన్నాయి. మరి జామ ఆకుల రసం (Guava Leaf Juice) వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జామ ఆకులలో సల్ఫర్, సోడియం, ఐరన్, బొరాన్, క్యాల్షియం, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి జామ ఆకుల రసం చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుందిం. దీనిని తరచుగా తీసుకుంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు. జామ ఆకుల రసం కడుపుకు చాలా మేలు చేస్తుంది. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.

గ్యాస్ లేదా ఎలాంటి రకమైన కడుపు సమస్య ఉన్న కచ్చితంగా ఈ ఆకుల రసాన్ని తీసుకోవడం వలన ఆ సమస్యలు తగ్గిపోతాయి. జామ ఆకులు (Guava Leaf) పంటి నొప్పికి ఒక దివ్య ఔషధంగా పనిచేస్తాయి. దంతాల నొప్పితో బాధపడే వారు జామ ఆకు రసాన్ని తీసి పళ్ళపై అప్లై చేస్తే చాలు నొప్పి మాయం అవుతుంది. అలాగే జామకులను లవంగాలతో మెత్తగా దంచి దంతాలపై అప్లై చేస్తే నొప్పి నుంచి త్వరగా బయటపడతారు. జామ ఆకులలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది సిరలలోని చెడు కొలెస్ట్రాల్ పొట్టలోని కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆకులను మిక్సీలో వేసి ఈ రసం తీసి నిత్యం తీసుకున్నట్లయితే ఊబకాయం నుంచి ఉపశమనం కలుగుతుంది.

Also Read:  Elon Musk – Gaza : ఆ ఆదాయమంతా గాజా, ఇజ్రాయెల్‌కు ఇచ్చేస్తా : మస్క్