Site icon HashtagU Telugu

Curry Leaves Juice Tips : కరివేపాకు జ్యూస్ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Do You Know The Amazing Benefits Of Curry Leaves Juice..

Do You Know The Amazing Benefits Of Curry Leaves Juice..

Curry Leaves Juice : మామూలుగా చాలామంది తినేటప్పుడు కూరలో కరివేపాకు కదా అని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ ఆ కరివేపాకు వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే మాత్రం వాటిని తినకుండా అస్సలు ఉండలేరు. మరి కరివేపాకు (Curry Leaves) వల్ల కరివేపాకు జ్యూస్ వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కరివేపాకు (Curry Leaves) వంటకి రుచి పెంచడంతోపాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. కరివేపాకును (Curry Leaves) మనం వంటల్లో బాగా వాడుతూ ఉంటాం. కరివేపాకు కొత్తిమీర లేకుండా వంటలు పూర్తి అవడం చాలా కష్టం. అయితే చాలామంది కూరలు టిఫిన్స్ లో కరివేపాకు తినకుండా పడేస్తూ ఉంటారు. వీటిని తినడం వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే ఇక దాన్ని అసలు పడేయరు.

We’re now on WhatsApp. Click to Join.

కరివేపాకు కూరల్లో తినడం కష్టంగా అనిపించేవారు దాన్ని రసం రూపంలో కూడా చేసుకొని త్రాగవచ్చు. కరివేపాకు రసం తయారు చేయడానికి పెద్దగా కంగారు పడవలసిన అవసరం లేదు. శుభ్రం చేసిన కరివేపాకును మిక్సీలో వేసి పేస్టులా పట్టుకోవాలి. కరివేపాకు ఆకులను మెత్తగా దంచినా కూడా పర్వాలేదు. గ్రైండర్ లేదా మిక్సర్ లేని వారు ఒక గిన్నెలో వాటర్ పోసి కరివేపాకుల్ని గ్యాస్ మీద పెట్టి సన్నని మంట మీద 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ కరివేపాకు ఆకులు గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత నీటిని వడకట్టి కరివేపాకును తీసివేసుకోవాలి. ఈ విధంగా చేసిన జ్యూస్ తయారవుతుంది. కరివేపాకు జ్యూస్ తీసుకోవడం వలన రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది. అలాగే జుట్టు సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.

బరువు తగ్గాలనుకునే వారు కరివేపాకు జ్యూస్ తాగడం వలన మంచి ఉపయోగం ఉంటుంది. దానికి తగ్గ శారీరక శ్రమ కూడా చేయవలసి ఉంటుంది. కొవ్వు కరిగించడంలోనూ కరివేపాకు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొవ్వు వలన రక్తం సరఫరా అవ్వదు. అటువంటి అప్పుడు కరివేపాకు తింటే లేదా జ్యూస్ తాగితే మీ ఆరోగ్యానికి మంచి మేలు జరుగుతుంది. కరివేపాకు జ్యూస్ నిత్యం తీసుకోవడం వలన బాడీ డిటాక్స్ అవుతుంది. దాని ద్వారా కడుపులో తిప్పడం, వికారం లాంటివి సమస్యలు నుంచి బయటపడవచ్చు. స్పీడ్ గా తినేవారికి అజీర్తి సమస్యలు వస్తుంటాయి. అప్పుడు కరివేపాకు తీసుకోవడం వలన అలాగే కరివేపాకు జ్యూస్ తాగడం వలన అజీర్తి సమస్య తగ్గిపోతుంది.

Also Read:  Bats: కలలో గబ్బిలాలు కనిపిస్తే ఏమి జరుగుతుందో తెలుసా?