Banana Leaf Water : అరటి ఆకు నీరు వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

కేవలం అరటి పండ్ల వల్ల మాత్రమే కాకుండా అరటి ఆకు నీటి (Banana Leaf Water) వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.

  • Written By:
  • Publish Date - December 9, 2023 / 07:20 PM IST

Banana Leaf Water : అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా లభిస్తూ ఉంటది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా అరటి పండుని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే కేవలం అరటి పండ్ల వల్ల మాత్రమే కాకుండా అరటి ఆకు నీటి (Banana Leaf Water) వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అరటి ఆకులో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బ్యాక్రియలు, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఉన్న అరటి ఆకులను (Banana Leaf) తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎన్నో వ్యాధుల నుండి బయటపడవచ్చు. అయితే మరి ఈ అరటి ఆకులను ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

అరటి ఆకులను తీసుకోవడం వలన ఎన్నో రకాల వ్యాధులకి చెక్ పెట్టవచ్చు. ఇందులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాగా మనం రోజు అరటి పండు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు పొందవచ్చు. అరటిపండు మాత్రమే కాకుండా దానికి కాయలు ఆకులు కూడా చాలా ఉపయోగాలు కలిగి ఉంటాయి. అరటి ఆకులో 60 శాతం నీరు ఉంటుంది. అలాగే దీనిలో సెలీనియం, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అరటి ఆకులను డైరెక్ట్గా తీసుకోలేము కాబట్టి వాటిని డికాషన్ గా తీసుకోవచ్చు. అరటి ఆకును చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి ఆ నీటిని మరిగించి ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి.

ఇది తినడానికి చాలా సులభమైన మార్గం.ఇలా చేయడం కష్టంగా ఉన్న వాళ్లకి అరటి ఆకులు నమిలి దాని రసాన్ని మింగవచ్చు. అరటి ఆకులను మరిగించిన నీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి నీరు చాలా అవసరం. అరటి ఆకు నీరు చర్మాని తేమగా ఉంచుతుంది. అరటి ఆకు శరీరం నుండి విషాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది.. అరటి ఆకులను ఉడకబెట్టడం వాటిని తాగడం వలన మీ శరీరాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో టాక్సిన్ బయటికి పంపిస్తాయి. అరటి ఆకులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు ఆంటీ ఫంగల్ , యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు హానికరమైన బ్యాటరీ అని నాశనం చేస్తాయి. మన జీర్ణక్రియ సక్రమంగా ఉంటే సగం రోగాలు తగ్గుతాయి. అరటి ఆకు మన ఆహారనాన్ని సక్రమంగా జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటే అవి తగ్గుముఖం పడతాయి.

Also Read:  Health Benefits: కాలీఫ్లవర్ ఆకులు,వేర్ల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?