Alcohol: మద్యం ఎక్కువగా సేవిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో మీకు తెలుసా?

  • Written By:
  • Updated On - February 24, 2024 / 10:52 PM IST

మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఈ విషయం తెలిసినా కూడా మద్యం సేవించడం ఆపరు. కొందరు ఎప్పుడో ఒకసారి మద్యం సేవిస్తే మరి కొందరు మాత్రం నిత్యం ప్రతిరోజు మద్యం సేవిస్తూనే ఉంటారు. మద్యానికి బాగా ఎడిక్ట్ అయినవారు పండుగ,పబ్బం అని తేడా లేకుండా ప్రతిరోజు మందులు తాగాల్సిందే. అయితే మద్యాన్ని అధికంగా సేవించడం అస్సలు మంచిది కాదు అని వైద్యులు ఎంత మొత్తుకున్నా కూడా అసలు వినిపించుకోరు. మరి మద్యం ఎక్కువగా సేవిస్తే ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎప్పుడైనా సరే మద్యం తాగేటప్పుడు మితంగా మాత్రమే తీసుకోవాలి. అలాకాకుండా ఎక్కువగా తీసుకుంటే కొంతసేపటికి స్పృహ లేకుండా కింద పడిపోతారు.

ఆలోచించే విచక్షణ కోల్పోతారు. అంటే మెదడు చురుకుదనం బాగా తగ్గిపోతుంది. ఒక్కోసారి నాడులు దెబ్బతిని గుండె వేగము తగ్గుతుంది. ఫలితంగా శ్వాసక్రియ నెమ్మదిస్తుంది. అది క్రమంగా మరణానికి కూడా దారి తీయవచ్చు. ఆల్కహాల్ పరిమితి అందరికీ ఒకేలా ఉండదు. చాలా వేగంగా శరీరంలోకి వెళ్తుంది. ఆ రక్తం ద్వారా మెదడు కాలేయం సహా శరీరంలోని ప్రతి అవయవానికి వెళ్తుంది. ఆ తరువాత ఆల్కహాల్ కణాలను విరిచేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుంది. ప్రమాదం ఉంటుంది. విచ్చల ప్రక్రియలో కొంత శక్తి కూడా విడుదల అవుతుంది. అతిగా మద్యం తాగే వారిలో కొందరు బరువు పెరగడానికి ఆసక్తి కూడా ఒక కారణం. ఆల్కహాల్ నుంచి శక్తి వస్తుంది కాబట్టి వారు తక్కువ ఆహారం తీసుకుంటూ ఉంటారు.

అప్పుడు వారికి క్యాలరీలు మాత్రమే అందుతాయి. అనారోగ్యానికి గురైనట్లుగా కనిపిస్తూ ఉంటారు. సాధారణంగా ఈ హార్మోన్ మూత్ర ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అప్పుడు మీరు తాగే నీళ్ల కంటే ఎక్కువ నీరు శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆల్కహాల్ మొదటి దశ విచ్చిన్న ప్రక్రియలో ఏర్పడే రసాయన పదార్థమే వాంతులకు కారణం. అంటే ఆ రసాయనం మన శరీరంలో విడుదలైనప్పుడు వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. మద్యం ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువ వాంతులు రావచ్చు. ఏదైనా పదార్థం తినగానే వాంతులు విరోచనాలు వస్తున్నాయంటే శరీరం నుంచి ఆ పదార్థాన్ని బయటకు పంపించాలి అంటూ మెదడు ఇచ్చిన ఆఖరి సూచనగా భావించాలి. దాంతో తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఒడ్క తో అలాంటి సమస్యలు కాస్త తక్కువ. ఎందుకంటే స్వచ్ఛమైన ఒడ్క్ ఆల్కహాల్ మద్య నీరు మాత్రమే ఉంటాయి. దీనివలన పెద్ద ప్రమాదం ఉండదు.