Site icon HashtagU Telugu

Yoga: యోగా చేయడం వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలున్నాయో తెలుసా

Yoga Asanas

Yoga Asanas

Yoga: ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది జిమ్ లు, ఎక్సర్ సైజ్ లతోపాటు ముఖ్యంగా యోగా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల అనేక ఆరోగ్య లాభాలున్నాయి. యోగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొందరికి చేస్తున్న పనులపై అస్సలు ఆసక్తి ఉండదు. అలాంటి వారు యోగా చేయడం వల్ల శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతాయి. యోగా మన కండరాలను దృఢంగా మారుస్తుంది. దీంతో శారీరకంగా శక్తివంతులుగా ఉంటాం. నీరసం లాంటివి దరి చేరవు.

యోగా పారా సింపథెటిక్‌ నాడీ వ్యవస్థ మెరుగవుతుంది. అందువల్ల ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. యోగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని వల్ల అకారణంగా మనం ఎదుటి వారిపై అసూయ, కోపం, ద్వేషం లాంటి వాటిని మనసులో నింపుకోకుండా ఉంటాం. యోగాభ్యాసం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతులుగా వుండవచ్చు. యోగా చేసే చురుకుగా ఉండటంతో పాటు ఆరోగ్యంగానూ ఉంటారు.

యోగా మనసు, శరీరాన్ని.. అంతర్గత భావాల్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతి రోజూ యోగా చేయడం వల్ల శారీరకంగానే కాకుండా, మానసికంగానూ మనం ఆరోగ్యంగా ఉంటాం. మనలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసమూ అలవడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను చూడటానికి, మనం క్రమం తప్పకుండా 30 రోజుల పాటు సాధన చేయొచ్చు.

దీని కోసం జీవనశైలిలో క్రమశిక్షణ, సంకల్పం తీసుకురావడం చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ’30 రోజుల యోగా ఛాలెంజ్’ తీసుకోవడం ద్వారా షాకింగ్ ఫలితాలను పొందవచ్చట. కేవలం కొన్ని రోజుల యోగాభ్యాసంతో, మీ మనస్సు మునుపటి కంటే చాలా ప్రశాంతంగా, పరధ్యానం లేకుండా ఉంటుంది. మీరు మీ శరీర శక్తిని సరైన దిశలో ఉపయోగించగలరు. ఒక లక్ష్యంపై దృష్టి పెట్టగల సామర్థ్యం యోగా ద్వారా మాత్రమే సాధించగలం.