Site icon HashtagU Telugu

Moringa: మునగాకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా

Munagaku Benefits must know and eat Regularly

Munagaku Benefits must know and eat Regularly

మునక్కాయలు అంటే దక్షిణాది తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. సాధారణంగా మునగ అనగానే మనకు గుర్తుకు వచ్చేది మునక్కాయలు. వీటిని అందరూ ఇష్టంగా లాంగించేస్తారు. మునక్కాయలు కాకుండా ఆకుల్లోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. మనగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మునగాకులో అనేక విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి. అసలు 4, 5 వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. ఆయుర్వేదంలో 300లకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు.

ఆరోగ్యంతోపాటు అధిక బరువును తగ్గించి, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో పోషకాలు లభించే ఆహార పదార్థాల్లో మునగాకులు ముందు స్థానంలో ఉంటాయి. మునగ ఆకు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడమే కాదు, రక్తంలోని అధిక చక్కెరలను నియంత్రించి శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును బయటకు పంపుతుంది. పెద్ద పేగులను కూడా శుభ్రం చేసి శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచి జీవక్రియలను ఉత్తేజితం చేస్తుంది. మునగ ఆకులో వుండే పోషకాలు, యాంటీ ఆక్సీడెంట్లు శరీరంలోని వాపును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. రక్తంలో చక్కర, కొవ్వులను నియంత్రించి గుండె పనితీరు మెరుగుపరుస్తుంది. కాలేయం, మెదడు ఆరోగ్యానికి మునగాకులో విటమిన్ -సి ఏడు రేట్లు కంటే 15 రేట్లు ఎక్కువగా ఈ ఆకులో ఉంటాయి. ప్రోటీన్లు, విటమిన్ – ఎ, కాల్షియం కూడా మునగాకుల్లో విరివిగా లభిస్తాయి.

రక్తపోటును నియంత్రించి, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటీస్ లాంటి వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. అంతే కాదు చర్మంలోని మృత కణాలను తొలగించి మృదువుగా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. హార్మోన్ల సమతౌల్యతను కాపాడి, కండరాల వాపు తగ్గించి, మంచి కొవ్వును అందిస్తుంది. అలెర్జీ, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాన్సర్ కణాలతో పోరాడీ ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార, అండాశయ కాన్సర్లను నిరోధిస్తుంది. మెదడును కూడా చురుకుగా ఉంచుతుంది. శరీరంలో నీటి సాంద్రతను సమతాస్థితిలో ఉంచుతుంది.
ఇందులో వుండే కాల్షియంతో ఎముకలు బలంగా తయారవుతాయి. బాలింతలు తీసుకుంటే తల్లిపాలు పిల్లలకు పుష్కలంగా అందుతాయి.