Health: నడకతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ప్రతిరోజూ నడక అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది, రోజంతా శక్తినిస్తుంది. మెరుగైన ఆత్మగౌరవం, మంచి మానసిక స్థితి రావడంతో పాటు, ఒత్తిడి-ఆందోళన ఉదయం నడకతో తగ్గుతాయి. నడక మెదడుకు రక్త సరఫరాను పెంచుతుంది, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సాధ్యమవుతుంది. నడకతో మెలటోనిన్ అంటే నేచురల్ స్లీప్ హార్మోన్ ప్రభావాలను పెంచి సులభంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
రోజుకు సగటున 30 నిమిషాలు నడవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని 35% తగ్గించవచ్చు. అధిక రక్తపోటు, శరీర కొవ్వు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించగల శక్తి నడకకి వుంది. రోజువారీ 30 నిమిషాల నడకతో టైప్ -2 డయాబెటిస్, ఊబకాయం తగ్గుతాయి. నడకతో కండరాల సమస్య, కీళ్ల నొప్పులను తగ్గుతాయి.
వేగంగా నడవడం వల్ల మన శరీరంలో కేలరీలు అధికంగా ఖర్చు అవుతాయనే విషయం మనకు తెలిసిందే. ప్రతి రోజు వాకింగ్ చేయడం వల్ల డయాబెటిస్‌తో పాటు గుండె జబ్బులు ఇతర రోగాలు దరి చేరకుండా ఉంటాయి. అయితే ఎంత వేగంగా నడిస్తే ఎన్ని కేలరీలు ఖర్చవుతాయి.. అనేది మనకు తెలియదు. తెలిస్తే మరికొన్ని కేలరీలు ఖర్చయ్యేలా నడుస్తాము. నడవడం వల్ల ఎన్ని కేలరీలు ఖర్చుఅవుతాయో వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
ఎక్కువ మంది బరువు త్వరగా తగ్గాలనే ఉద్దేశంతో వాకింగ్ చేస్తుంటారు. వేగంగా నడుస్తుంటారు. అలాంటి వారు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చాలా కఠిన మైన నియమాలు పెట్టుకుని వాకింగ్ చేస్తున్నా.. తిండి ఆపకపోతే వారు అనుకున్న ఫలితాన్ని సాధించలేరు. వాకింగ్ చేసిన పెద్దగా ప్రయోజనం ఉండదు. మరీ ముఖ్యంగా కొంతమంది అవసరం లేకపోయినా అదే పనిగా తింటూ ఉంటారు. వీరు తినే ఆహారం కూడా ఎక్కు వగా జంక్ ఫుడే అయి ఉంటుంది. ఇలాంటివారు ఎంతగా వాకింగ్ చేసినా.. బరువు తగ్గటం అంటూ ఉండదు. ఆహారాన్ని అదుపులో పెట్టుకోకపోతే శ్రమంతా వృథా అయిపోతుంది.