Site icon HashtagU Telugu

Health: చెరుకు రసంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా

Sugarcane

Sugarcane

Health: చెరకు రసం వల్ల బోలెడు ఉపయోగాలు ఉన్నాయి. చెరకు రసంలో ఉండే గ్లూకోజ్ ను, శరీరం చాలా వేగంగా తీసుకుని వెంటనే ఉపయోగించుకుటుంది. అందుకే చెరకు రసం తక్షణ ఉత్తేజాన్నిస్తుంది. అలాగే చెరకు రసంలో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. చెరకు రసం ఔషధం కూడా.

ముఖ్యంగా కామెర్లు, దంత సమస్యలు, మూత్ర సంబంధిత బాధితులకు చెరకు రసం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. అలాగే కిడ్నీలో రాళ్లు కరగడానికి, రాళ్లు విచ్ఛిన్నమై మూత్రంలో వెళ్లిపోవడానికి చెరకు రసం వినియోగం దోహదం చేస్తుంది.చెరకు రసంలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, పాస్ఫరస్ లు సమృద్ధిగా ఉంటాయి.ఆల్కలైన్ స్వభావం కలిగిన చెరకు రసం ప్రోస్టేట్, కోలన్, ఊపిరితిత్తుల, రొమ్ము క్యాన్సర్ మరియు క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది.

ఐతే ఈ రసంతో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. చెరుకు రసం సేవించేవారిలో కొందరికి ప్రతికూలమైన ఫలితాలు రావచ్చు. చెరుకు రసం తాగితే శరీరానికి అత్యధిక క్యాలరీలు చేరిపోతాయి. చెరుకు రసం తీసిన 20 నిమిషాల లోపు సేవించకపోతే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. చెరుకు రసం తాగేవారిలో నిద్రలేమి సమస్య తలెత్తవచ్చు. చెరుకు రసంలో ఉండే పోలికోసనాల్ రక్తాన్ని పల్చగా మార్చగలదు. చెరుకు రసం తయారీ ప్రక్రియ అపరిశుభ్రంగా వుండటం వల్ల చాలా త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంటుంది.