Health Tips : చామకూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే…!!

గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే చామ కూర ఆకుల గురించి చాలా తక్కువ విషయాలు మనకు తెలుసు.

  • Written By:
  • Publish Date - September 4, 2022 / 09:00 PM IST

గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే చామ కూర ఆకుల గురించి చాలా తక్కువ విషయాలు మనకు తెలుసు. ముఖ్యంగా వర్షాకాలంలో బాగా దొరుకుతుంది. చాలా మంది ఈ ఆకులను చూసి ఉంటారు. కానీ దాన్ని తినేందుకు అంతగా ఇష్టపడరు, కొంత మంది చామకూర తింటే అనారోగ్యం పాలవుతారనే మూఢనమ్మకం ఉంది. బహుశా దాని పోషకవిలువల గురించి తెలియకపోవడం వల్ల అలాంటి అపోహలు తలెత్తే అవకాశం ఉంది. చామకూర ఆకులతో పప్పు చేసుకొని తింటే చాలా మంచిది. చామకూర ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.

రక్తహీనతలో మేలు చేస్తుంది
చామకూర ఆకులలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తహీనత సమస్యను నయం చేస్తుంది. దీని వినియోగం హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఐరన్, ఫైబర్ ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

కళ్లకు మంచిది
చామకూర ఆకులలో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఇది కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరం యొక్క ఎముకలను బలోపేతం చేస్తుంది. దృష్టిని పదునుపెడుతుంది.

రక్తపోటును తగ్గిస్తుంది
చామకూర ఆకులను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులో యాంటీహైపెర్టెన్సివ్ గుణాలు ఉన్నాయి, ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. దీని నిరంతర వినియోగం రక్తపోటును కూడా తగ్గిస్తుంది. చామకూర ఆకులను పొట్లాలుగా చేసుకొని తినే స్నాక్ చాలా రుచికరంగా ఉంటుంది.

బరువు తగ్గించడంలో సహకరిస్తుంది
చామకూర ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. శరీరానికి శక్తిని ఇస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి చామకూర ఆకులు చాలా మేలు చేస్తాయి.

గుండెకు మంచిది
చామకూర తినడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. చామకూర ఆకులలో నైట్రేట్లు ఉంటాయి, ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చామకూర ఆకులను తినండి. మీరు చేమకూర ఆకులను తిన్నప్పుడల్లా, వాటిని నూనెలో ఎక్కువగా వేయించకూడదని గుర్తుంచుకోండి.