Health: తులసి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా

  • Written By:
  • Updated On - February 7, 2024 / 01:04 AM IST

తులసి ఆరోగ్యం ప్రయోజనాలు మానవుని ఆరోగ్య పరిరక్షణ లో అత్యధిక ప్రాధాన్యత కలిగిన తులసి, భారతీయ సంస్కృతి లో ప్రత్యేక స్థానం ఉంది. చాలా ఆరోగ్య సమతుల్యతను కాపాడ గల తులసి ఒక విధంగా ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పవచ్చు. రోజుకు కనీసం ఒక మూడు ఆకులు తినడానికి ఉత్సాహ పదము. దీని వాసన, దీని పై నుంచి వీచే గాలి, నీటిలో కరిగే వచ్చే తీర్థం అన్నీ రోగ నివారిణులుగా పని చేస్తుంది. ఇది నయం చెయ్యని రోగం లేదు. తులసి ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకునే ముందు అసలు తులసి ఎన్ని రకాలు ఉన్నాయి. అన్నది ఒకసారి తెలుసుకుందాం

నిఘంటువులో తులసి చాలా పేరు కనిపిస్తాయి. కానీ మనకు తులసి లో మొత్తం మన దేశానికి సంబంధించిన 7 తులసి రకాలున్నాయి. ప్రధానమైనవి. 3 అని అర్చన పరంగా చెప్పిన (శ్రీలక్ష్మి తులసి, కృష్ణ తులసి, వన తులసి) ఆయుర్వేదంలో ఉపయోగించే రకాలు నాలుగింటిని కలిపి ఏడు రకాలుగా తులసి లభ్యమవుతున్నది.

కృష్ణ-తులసి దీనినే ‘నల్ల తులసి’ అని కూడా వ్యవహరిస్తారు. మూడున్నర అడుగుల ఎత్తు వరకూ పెరగగల ఈ మొక్క శాస్త్రీయ నామం (Botanical name) “ఓస్సిమమ్ శాంక్టమ్’ క్రిష్టియన్స్ దీన్ని హోలీ బ్లాక్ బాసిల్ అంటారు. ఇది క్రీస్తు సమాధి మీద నాటబడినది. బొల్లి, మలేరియా, ధనుర్వాతం, గుండెజబ్బులు, విషదోషాలు, ప్లేగు నివారిస్తుంది. కృష్ణ తులసి తైలాన్ని ఊపిరి తిత్తుల రోగాలకు, గాయాలకు, చర్మ వ్యాధులు తయారు చేసే మందుల లో ఉపయోగిస్తారు.

లక్ష్మి-తులసి ‘తెల్ల తులసి’ లేక లక్ష్మి తులసి అని వ్యవహరించే దీని శాస్త్రీయ నామం “ఓస్సిమమ్ విల్లోస్సమ్’. దీనికాడలు తెల్లగా ఉంటాయి. నాలుగైదు అడుగుల ఎత్తువరకు పెరుగుతుంది. . ఇందులో మళ్లీ రెండు జాతులు లభ్యమవుతున్నాయి. మంచి పరిమళం, పెద్ద పెద్ద ఆకుల తో, దట్టమైన పుష్పగుచ్ఛాలు ఉండే జాతి గల తెల్ల తులసి క్రిమి కీటక నాశిని. ఇంట్లో ఒక కొమ్మ వ్రేలాడ దాస్తే దోమలు దరిచేరవు.. ” వస్థ దవనం ఆకు వల్ల చిన్న చిన్న ఆకులు ఉండే ఇంకో జాతి తెల్ల తులసిని మూత్ర సంబంధ రోగాలు నివారినిగా ఉపయోగిస్తారు.

రామ-తులసి.. ఒక మీటరు ఎత్తు పెరిగే ఈ తులసి శాస్త్రీయ నామం ‘ఓసి మం బలాట్టమ్’. చాలా వాసన కలిగి ఉంటుంది. ఇది కూడా క్రిమి కీటక సంహారిణిగా పనిచేస్తుంది. రాతి నేలలు, కొండవాలు లలో ఎక్కువగా కనిపిస్తుంది తులసి. నీటి వనరులు లేని చోట్ల కూడా పెరగగలదు. జీర్ణశక్తిని పెంచే గుణం గల రామ తులసి ఆకులను కొన్నింటిని భోజనానంతరం సేవిస్తే కడుపులో నులి పురుగులు సైతం నశిస్తాయి. అడవి-తులసి..గిరిజనులు తమ పాలిటి కల్పతరువు గా భావించే అడవి తులసి కూడా ఔషధగుణాలను కలిగి ఉంది. ఎక్కువ ఎత్తు ఎదగదు. ‘ఓస్సిమమ్ కారోఫైమాటన్, దీని శాస్త్రీయ నామం. చాలా ఘాటైన వాసన కలిగి తేలు, జెర్రీ వంటి పెద్ద విషకీటకాల విషాన్ని విరిచే గుణాన్ని కలిగి ఉంది. శ్రీశైలం, తిరుపతి, తలకోన తదితర అడవులలోనూ కొన్ని కొండ ప్రాంతాల్లో ను లభిస్తుంది.