Ridge Gourd: బీరకాయల వల్ల ఎన్ని అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

బీరకాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకసారి దాని గురించి తెలుసుకుంటే ఇంకోసారి వదిలిపెట్టకుండా తింటారు. రోజూ బీరకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది.

  • Written By:
  • Publish Date - May 7, 2023 / 04:07 PM IST

Ridge Gourd: బీరకాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకసారి దాని గురించి తెలుసుకుంటే ఇంకోసారి వదిలిపెట్టకుండా తింటారు. రోజూ బీరకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది. బీరకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి.

బీరకాయలో ఐరన్ రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, థయామిన్ తో పాటు అనే ఖనిజ లవణాలు ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. ఉదర సంబంధిత సమస్యలను దూరం చేయడంలో బీరకాయ బాగా ఉపయోగపడుతుంది. వాత శరీరాలను కలిగి ఉన్నవారు బీరకాయ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక బీరకాయతో చేసి కర్రీ, ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం వల్లనే కాకుండా బీరాకు రసంను తాగడం వల్ల కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.

బీరాకు రసం తాడం వల్ల రక్తంలోని మలినాలు తొలగిపోతాయి. షుగర్ తో పాటు మలబద్ధకాన్ని ఇది తగ్గిస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తి మెరుగుపర్చుకోవడం, షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవడంలో బీరకాయ చాలా సహాయపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నరు. అలాగే కొంతమందికి చర్మంపై మచ్చలు, మెటికలు లాంటి వస్తాయి. బీరకాయలు తీసుకోవడం వల్ల అవి తొలగిపోయి చర్మం కాంతివంతగా ఉంటుంది.

ఇక బీరకాయలో సెల్యులోజ్, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఫైల్స్ సమస్యతో బాధపడేవారు బీరకాయం తింటే ఉపశమనం లభిస్తుందట. ఇక కామెర్ వ్యాధి చికిత్సకు కూడా బీరకాయ హెల్ప్ చేస్తుంది. రోజుకో గ్లార్ బీరకాయ రసం తాగితే కామెర్ల వ్యాధి తగ్గుతుంది. అలాగే శరీరంలోని రక్తాన్ని శుద్ది చేయడం, కాలేయం, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో బీరకాయ ఎంతో ఉపయోగపడుతుంది.అలాగే బీరకాయలో ఉండే విటమిన్ బి6 అనీమియాను నివారించడంలో పాటు అల్సర్లతో బాధపడేవారిని రక్షిస్తుంది.