Site icon HashtagU Telugu

Garlic : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే.. ఎన్ని లాభాలో తెలుసా..?

Do you know how many benefits there are if you eat two cloves of garlic every day?

Do you know how many benefits there are if you eat two cloves of garlic every day?

Garlic : ఆర్యోగ సంబంధిత సమస్యలు చిన్న వయస్సులోనే మనలను వెంటాడుతున్న రోజులివి. కాలానుగుణంగా మారుతున్న జీవనశైలీ, ఆహారపు అలవాట్లు, పనిలో ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం వంటి కారణాలతో ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. గతంలో వృద్ధులకి మాత్రమే కనిపించే రక్తపోటు, కొలెస్ట్రాల్‌, షుగర్‌ వంటి వ్యాధులు ఇప్పుడు యువతలోనే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే జీవనశైలిని మెరుగుపరచడమే కాదు, కొన్ని చక్కని ఆహారపు అలవాట్లను అభ్యసించాలి. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది వెల్లుల్లి (Raw Garlic). వంటలలో రుచికి ఉపయోగించే వెల్లుల్లి పచ్చిగా తినడంవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పచ్చి వెల్లుల్లి – ఆరోగ్యానికి ఓ ఆమృతం

వెల్లుల్లిలో విటమిన్‌ B6, విటమిన్‌ C, మాంగనీస్‌, సేలీనియం, ఫైబర్, కాల్షియం, ఐరన్‌, పొటాషియం వంటి అనేక పోషకాలతో పాటు అలిసిన్ అనే శక్తివంతమైన యాంటీబాక్టీరియల్‌, యాంటీఆక్సిడెంటు గుణాలు కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని తక్కువ కాలుష్యంతో కూడిన, చురుకైన ఆరోగ్యస్థితిలో ఉంచడానికి సహాయపడతాయి.

ఖాళీకడుపుతో వెల్లుల్లి తినడ ప్రయోజానాలు

ప్రతిరోజూ ఉదయం ఖాళీకడుపుతో ఒక లేదా రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

. రోగనిరోధక శక్తి పెరుగుతుంది: వెల్లుల్లిలో ఉన్న సక్రియ పదార్థాలు శరీరంలోని వ్యాధికారక బ్యాక్టీరియాలపై ప్రభావం చూపించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
. జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది: ఖాళీకడుపుతో తీసుకున్న వెల్లుల్లి జీర్ణ సంబంధ సమస్యలు, గ్యాస్‌, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
. వాపులు, నొప్పులు తగ్గుతాయి: వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటంతో శరీరంలోని వాపులను, నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.
. హృదయ ఆరోగ్యం మెరుగవుతుంది: ఇది రక్తనాళాలను శుభ్రపరిచి, రక్తప్రసరణను మెరుగుపరచుతుంది. ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది, కొలెస్ట్రాల్‌ స్థాయిలు కూడా సమతుల్యంగా ఉంటాయి.
. ఊతపరిచే గుణాలు: వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కోసి ఎక్కువసేపు నమిలి తినితే, శరీరానికి వెంటనే జవదలిచే శక్తి అందుతుంది.

నోరు వాసనకు పరిష్కారం

వెల్లుల్లి తినిన తర్వాత వచ్చే దుర్వాసన గురించి చాలామంది ఇబ్బంది పడతారు. కానీ ఇది సాధారణమే. ఒక మంచి మౌత్‌వాష్‌తో నోరు కడిగితే చాలు, ఆ సమస్య పరిష్కారమవుతుంది.

అయితే జాగ్రత్తలు కూడా అవసరమే

. వెల్లుల్లి ఎంతో ఆరోగ్యకరమైనదే అయినా, అందరికి సరిపోతుందని కాదు.
. రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుతున్నవారు పచ్చి వెల్లుల్లిని తినడాన్ని నివారించాలి, ఎందుకంటే ఇది రక్త స్రావ సమస్యకు దారి తీస్తుంది.
. అలాగే ఏదైనా శస్త్రచికిత్సకు (సర్జరీకి) సిద్ధమవుతున్నవారు ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలి.
. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా డాక్టర్‌ సూచన మేరకే వెల్లుల్లిని తినాలి.

కాగా, పచ్చి వెల్లుల్లి మన ఆరోగ్యాన్ని సమతుల్యం చేసే ఔషధగుణాలున్న సహజ ఆహార పదార్థం. రోజూ ఖాళీకడుపుతో ఓ రెబ్బ తినడం వల్ల మీరు అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. కానీ, దాన్ని ఎలా, ఎప్పుడు తీసుకోవాలో తెలియకుండానే ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రమాదాలు సంభవించవచ్చు. కాబట్టి అవసరమైతే వైద్యుల సలహా తీసుకుంటూ, ఆరోగ్యవంతమైన జీవనశైలిని పాటిస్తూ పచ్చివెల్లుల్లిని మీ జీవితం లో భాగం చేసుకోండి.

Read Also: Nitin Gadkari: ఏపీలో వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్న నితిన్ గడ్కరీ