health vegetables: హెల్త్ టిప్స్.. దొండకాయ తింటున్నారా? ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే..?
కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, డ్రైఫ్యూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా పండ్లు, కూరగాయలు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా కూరగాయాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూ మనం తినే కూరగాయాల్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. కానీ వాటి గురించి మనకు తెలియదు. ఇప్పుడు కూరగాయల్లో దొడకాయ గురించి ఇప్పుడు తెలుసుకుంది.
దొండకాయ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉణ్నాయి. ఇందులో ఫైబర్, విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, ఫాస్పరస, విటమిన్ బి1,బి2,బి3,బి6,బి9 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇక దొండకాయలో యాంటీ అడిపోజెనిక్ ఏజెంట్ ఉంటుంది. ఇది షుగర్ ను అదుపులో ఉంచుతుంది. షుగర్ రోగులు వారం ఒక రోజు దొండకాయ తిన్నా లేదా దొండ ఆకుల రసం తాగినా షుగర్ అదుపులోకి వస్తుంది. ఇక దొండకాయ జీవక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే దొండకాయ తినడం వల్ల ఎర్ర రక్తకణాలు ఎక్కువగా ఏర్పడతాయి. అలాగే జన్సుపరమైన వ్యాధులను కూడా దొండకాయ నయం చేస్తుంది.
అలాగే రక్తహీనతతో బాధపడేవారు దొండకాయలను తింటే మంచిది. రక్తహీనత నుంచి బయటపడవచ్చు. ఇక దొండకాయ బరువును అదుపులో ఉంచుతుంది. స్ధూలకాయం సమస్య రాకుండా దొండకాయ కాపాడుతుంది. దొండకాయలో టైటరీ ఫైబర్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మలబ్ధకం, అల్ర్లు, ఎిసిడిటి సమస్యలను తగ్గిస్తుంది. అలే జీర్ణక్రియను మరింత మెరుగుపరుస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇలా మనం ఆహారం తినే దొండకాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో ఆహారంలో దొండకాయను వారానికి ఒకసారైనా తీసుకోండి. దీని వల్ల మీకు చాలా అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.