Site icon HashtagU Telugu

Jaggery Tea: శీతాకాలంలో బెల్లం టీ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Mixcollage 16 Jan 2024 06 43 Pm 5892

Mixcollage 16 Jan 2024 06 43 Pm 5892

ప్రస్తుత రోజుల్లో టీ అలవాటు లేని వారిని వేళ్ళలో లెక్కపెట్టవచ్చు. ఎందుకంటే ప్రతి పదిమందిలో తొమ్మిది మందికి టీలు కాఫీలు తాగే అలవాటు ఉంది. ఉదయం లేచిన దగ్గర్నుంచి సాయంత్రం పడుకునే లోపు కనీసం ఒకటి లేదా రెండు మూడు సార్లు అయినా కాఫీ, టీ తాగుతూ ఉంటారు. కాఫీలతో పోల్చుకుంటే టీ తాగే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే టీలో కూడా ఎన్నో రకాల టీలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటి వాటిలో బెల్లం తో తయారు చేసే టీ కూడా ఒకటి. చక్కెరతో చేసిన టీ కంటే బెల్లం తో తయారు చేసిన టీ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లంలో భాస్వరం, ఐరన్, సుక్రోజ్, విటమిన్లు ఏ, బి, పలు ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అందుకే శీతాకాలంలో బెల్లం టీ చాలా ఆరోగ్య కరంగా ఉంటుంది. శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత రోగ నిరోధక శక్తి అవసరం అవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి బెల్లం తీసుకోవడం చాలా మంచిది. బెల్లం తీసుకోవడం వల్ల అనేక పోషకాలు అందుతాయి. దీంతో శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ అనేవి పెరుగుతాయి. బెల్లం టీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో బాగా హెల్ప్ అవుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. జీర్ణ సమస్యల్ని తగ్గించడంలో బెల్లం బాగా సహాయ పడుతుంది. ఇది మల బద్ధకాన్ని నివారించడంలో ఉపయోగపడుతుంది.

భోజనం తర్వాత మీరు తిన్న ఆహారం మెరుగ్గా జీర్ణం కావడానికి మీ టీలో బెల్లం చేర్చుకోవడం చాలా ముఖ్యం. శీతాకాలంలో జలుబు, దగ్గు వంటివి కారణంగా చాలా మంది శ్వాస కోశ సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా శ్వాస కోశ మార్గాన్ని క్లియర్ చేయడానికి, గొంతు చికాకును తగ్గించడానికి బెల్లం టీ బాగా సహాయ పడుతుంది. అంతే కాకుండా జలుబు, దగ్గును కూడా నివారిస్తుంది. బెల్లం టీ తీసుకుంటే శరీరానికి ఐరన్ బాగా అందుతుంది. ఇది ఆరోగ్యకరమైన రక్త స్థాయిలను నిర్వహించడానికి చాలా ముఖ్యం. సరైన మొత్తంలో బెల్లం వాడితే ఆక్సిజన్ సమర్థవంతంగా అన్ని భాగాలకు చేరుస్తాయి ఎర్ర రక్త కణాలు.

Exit mobile version