Site icon HashtagU Telugu

Anjeer : ‘అంజీర్’లో ఉండే పోషక విలువల గురించి మీకు తెలుసా ?

Do you know Benefits of Dry Fruit Anjeer

Do you know Benefits of Dry Fruit Anjeer

అంజీర్(Anjeer) అనగా.. అత్తి పండ్లు. అత్తి పండ్లను ఎండబెట్టడం ద్వారా అంజీర్ డ్రై ఫ్రూట్(Dry Fruit) తయారవుతుంది. డ్రై ఫ్రూట్స్ లో ఇది కూడా ఒకటి. అంజీర్ లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు డైటరీ ఫైబర్ కూడా లభిస్తుంది. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే బరువు తగ్గడంలోనూ సహాయపడతాయి.

పావు కప్పు అంజీర్ లలో 7 గ్రాముల డైటరీ ఫైబర్ లభిస్తుంది. ఇది ప్రేగు కదలికలను నియంత్రించడం, మలబద్ధకాన్ని నివారించడంలో, డైవర్టికులిటిస్, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

అంజీర్ లో కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలతో పాటు విటమిన్ బి6, విటమిన్ కె కూడా ఉన్నాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకలు, కండరాలు, హృదయనాళ పనితీరును మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

అంజీర్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఈ డ్రై ఫ్రూట్ లో కొవ్వు తక్కువగా, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని డైట్ లో ప్రధానంగా తీసుకుంటారు.

ఇందులో ఉండే పొటాషియం రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే రక్తనాళాల విశ్రాంతికి సహాయపడుతుంది. అధిక రక్తపోటు (హై బీపీ) ఉన్నవారికి లేదా రక్తపోటు వచ్చే సూచనలున్నవారు అంజీర్ ను ప్రతిరోజూ తినడం మంచిది.

అంజీర్ లలో ఉండే మినరల్స్ చర్మం, జుట్టుకు చాలా అవసరం. వీటిలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అలాగే ఐరన్ జుట్టు రాలడాన్ని నిరోధించి, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

 

Also Read :  Ayurvedic drinks: రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్ తాగితే బాడీలోని వేడి తగ్గుతుంది బాడీలోని వేడిని తగ్గించే ఆయుర్వేద డ్రింక్స్.. పడుకునే ముందు తాగితే..