Site icon HashtagU Telugu

Eggs: పిల్లలు ఏ వయసులో గుడ్లు తినాలో మీకు తెలుసా..

Foods Avoid With Eggs

Foods Avoid With Eggs

Eggs: పిల్లల ఆహారంలో గుడ్లు చేర్చడం వల్ల వారి ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది. ఎందుకంటే గుడ్డులోని ప్రోటీన్  మంచి బలాన్నిస్తాయి. అయితే పిల్లలకు మొదటిసారి గుడ్లు ఎప్పుడు ఇవ్వాలి?  ఎంత గుడ్డు ఇస్తే సరైనది అనే ప్రశ్న తల్లిదండ్రులకు తరచుగా ఉంటుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, పిల్లలు ఆరు నెలల వయస్సు తర్వాత మాత్రమే గుడ్లు తినడం ప్రారంభించవచ్చు. ఈ వయస్సులో వారికి అదనపు పోషణ అవసరం.

మీరు పిల్లలకు మొదటిసారి గుడ్డు ఇచ్చినప్పుడు, మొదట నాలుగో వంతు లేదా సగం గుడ్డు మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నించండి. పిల్లవాడు గుడ్లను బాగా జీర్ణం చేసుకోగలడా లేదా ఏ రకమైన అలెర్జీతో బాధపడుతున్నాడా అని చెక్ చేయాలి. వారానికి ఒకసారి ఈ పరిమాణాన్ని ఇవ్వండి. ప్రతిదీ సరిగ్గా జరిగితే మీరు క్రమంగా పరిమాణాన్ని పెంచవచ్చు.

గుడ్డు ప్రోటీన్ పిల్లల కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. గుడ్లలో విటమిన్ ఎ, విటమిన్ బి12 మరియు సెలీనియం వంటి కీలక పోషకాలు ఉంటాయి. అయితే గుడ్లు మంచి చేస్తాయనే కారణంతో ప్రతిరోజు పిల్లలకు ఇవ్వడం కూడా మంచిది కాదు. అప్పుడప్పుడు డైట్ ను మార్చాల్సి ఉంటుంది. కొంతమంది పిల్లలకు డాక్టర్ల సలహా మేరకు గుడ్లు ఇవ్వాల్సి ఉంటుంది.