Site icon HashtagU Telugu

Sugar Patients : షుగర్ కంట్రోల్లో ఉండాలంటే పెరుగులో ఈ గింజలు నానబెట్టి తినాల్సిందే?

Do You Have To Soak These Seeds In Yogurt To Keep Your Sugar Under Control..

Do You Have To Soak These Seeds In Yogurt To Keep Your Sugar Under Control..

ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో ఆరుగురు డయాబెటిస్ (Sugar) సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. మామూలుగా డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా షుగర్ (Sugar)ని అదుపులో ఉంచుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల చిట్కాలను పాటించడంతోపాటుగా ఇంగ్లీష్ మందులను కూడా తరచూ వాడుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువగా ఆయుర్వేద చిట్కాలను వంటింటి చిట్కాలను ఉపయోగించి చాలా వరకు అనారోగ్య సమస్యలను దూరం చేసుకుంటున్నారు. అయితే మరి మన వంటింట్లో దొరికే కొన్ని రకాల వస్తువులతో షుగర్ (Sugar)ను ఎలా కంట్రోల్ లో ఉంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

డయాబెటిస్ రావడానికి గల ముఖ్య కారణాల్లో మనం తీసుకునే ఆహార ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇదివరకటి రోజుల్లో డయాబెటిస్ అంటే కూడా ఏంటో తెలియదు. కానీ ప్రస్తుత రోజుల్లో మనుషుల జీవనశెలితో పాటు ఆహారపు అలవాట్లు మారిపోవడంతో చిన్న వయసులోనే ఈ డయాబెటిస్ సమస్య వచ్చేస్తుంది. డయాబెటిస్ సమస్య రాకుండా ఉండాలి అంటే ఆహారం తిన్న తర్వాత కచ్చితంగా ఒక అరగంట సేపైనా వాకింగ్ చేయడం మంచిది. డయాబెటిస్ తగ్గడానికి అలాగే మానసికంగా కృంగిపోకుండా ముందు ధైర్యంగా ఉంటూ ఆహరం మార్చుకొని దానికనుగుణంగా ప్రతిరోజు వాకింగ్ చేస్తూ తగినంతగా విశ్రాంతి తీసుకుంటూ చక్కగా ఉంటే డయాబెటిస్ అనే సమస్య నుంచి మీరు బయటపడచ్చు.

డయాబెటిస్ సమస్య ఉన్నవారికి బీరకాయ ఎంతో బాగా పనిచేస్తుంది. బీరకాయ తినడం వల్ల శరీరంలో ఏదైనా పుండ్లు ఉంటే ఆ పుండ్లు మానిపోవడంతో పాటు డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది. అలాగే డయాబెటిస్ పేషెంట్లు మజ్జిగలో నానబెట్టిన మెంతులను తినడం వల్ల తొందరగా డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు. రాత్రి మజ్జిగలో మెంతులను నానబెట్టి ఉదయాన్నే ఆ మెంతులను తినడం వల్ల డయాబెటిస్ తప్పకుండా అదుపులో ఉంటుంది. మజ్జిగ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉత్త నీటిలో అయినా మెంతులు నానబెట్టి ఆ మెంతులను ఉదయాన్నే తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

Also Read:  Coconut Milk : పొడవాటి జుట్టు కావాలంటే కొబ్బరి పాలలో ఆ రెండు కలిపి రాయాల్సిందే?