Site icon HashtagU Telugu

Fenugreek Seeds : చర్మం మెరిసిపోవాలంటే మెంతులతో ఇలా చేయాల్సిందే?

Do You Have To Do This With Fenugreek To Make Your Skin Glow..

Do You Have To Do This With Fenugreek To Make Your Skin Glow..

Fenugreek Seeds for Glowing Skin : మామూలుగా చాలామంది స్త్రీ, పురుషులు చర్మం మెరిసిపోవడం కోసం ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లు పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లభించకపోవడంతో బాధపడుతూ ఉంటారు. అయితే మన వంటింట్లో దొరికే కొన్నింటిని ఉపయోగించి మనం మెరిసే అందాన్ని సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా మెంతులతో (Fenugreek Seeds) అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చు. మెంతులు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. మరి మెంతులను (Fenugreek Seeds) అందానికి ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

ఇందుకోసం దోసకాయ 1, మెంతులు 2 చెంచాలు, తేనె 1 చెంచా నిమ్మకాయ 1, కొబ్బరి నూనె 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. వీటన్నింటితో మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయానికొస్తే.. ముందుగా నిమ్మకాయని కట్ చేసి రసం పిండికోవాలి. దోసకాయని తురుములా చేసి ఫిల్టర్ చేసి రసం తీసుకోవాలి. ఇప్పుడు మెంతులని (Fenugreek Seeds) గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నిమ్మరసం, దోసకాయ రసం, తేనె, కొబ్బరి నూనె వేసి బాగా కలిపితో ఫేస్ ప్యాక్ రెడీ. ఈ మిశ్రమం రెడీ అయిన తర్వాత ఆ ప్యాక్‌ని స్కిన్‌పై అప్లై చేసి 15 నిమిషాల పాటు అప్లై చేసి ఆరనివ్వాలి.

తర్వాత చల్లని నీటితో క్లీన్ చేయాలి. తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ అప్లైచేయాలి. ఈ ప్యాక్ అప్లై చేస్తే స్కిన్ హైడ్రేట్ అవుతుంది. చర్మం పొడిబారడం తగ్గుతుంది. మృదువైన చర్మాన్ని అందిస్తుంది. దీని వల్ల చర్మ రంధ్రాల్లోని మలినాలు, మృతకణాలు తొలగి చర్మం కాంతివంతంగా మారుతుంది. రెగ్యులర్‌గా అప్లై చేస్తే చాలా మంచిది. డెడ్ స్కిన్ సెల్స్ దూరమవుతాయి. అంతేకాకుండా ఈ ఫేస్ ప్యాక్ ని ట్రై చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే చర్మం మరింత కాంతివంతంగా తయారవుతుంది.

Also Read:  Millionaire : శనివారం రోజు ఈ ఐదు రకాల నియమాలు పాటిస్తే చాలు.. కోటీశ్వరులు అవ్వడం కాయం..