Site icon HashtagU Telugu

Health Benefits: కాల్షియం లోపంతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఒక్కటి తీసుకుంటే చాలు?

Mixcollage 05 Jan 2024 05 57 Pm 8213

Mixcollage 05 Jan 2024 05 57 Pm 8213

ప్రస్తుత రోజుల్లో చాలామంది క్యాల్షియం లోపంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్యాల్షియం కారణంగా మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు మోచేయి నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ నొప్పులు కారణంగా చాలామంది రాత్రి సమయంలో సరిగా నిద్ర పట్టక నిద్రలేని సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఇక సరిగా నిద్ర పోకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీటన్నింటికీ కారణం క్యాల్షియం లోపం. కాబట్టి ఈ కాల్షియంను సరైన మోతాదులో తీసుకుంటే ఎటువంటి సమస్యలు రావు. క్యాల్షియం అనేక రకాల ఆహార పదార్థాలలో లభిస్తుంది. ముఖ్యంగా పాలు పాల పదార్థాలలో ఈ కాల్షియం ఎక్కువగా ఉంటుంది.

పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని తీసుకుంటే చాలు ఈ నొప్పుల సమస్యలు ఉండవు. అయితే ఇలా కాల్షియం లోపంతో బాధపడేవారు ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు. ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. దీని కోసం ముందుగా గసగసాలు తీసుకోవాలి. గసగసాలను ఉపయోగించి ఏ వంటకం చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా ఇది మన శరీరంలోని ఎన్నో జబ్బులను నయం చేస్తుంది. గసగసాల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. గసగసాలతో పాటు సోంపును తీసుకోవాలి. సోంపు తింటే ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది. జీర్ణ సమస్యలను దూరం చేయడంలో సోంపు ఎంతో చక్కగా పని చేస్తుంది. సోంపును తరచూ తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుంది.

అధిక కొవ్వు ఉన్న వాళ్లకి కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. వీటితో పాటు ఎండు కొబ్బరిని తీసుకోవాలి. కొబ్బరిలో కాల్షియం అలాగే అనేక పోషకాలు ఉంటాయి. అలాగే ఎండు కొబ్బరి మంచి శక్తిని ఇస్తుంది. మరో పదార్థం పటిక బెల్లం. పటిక బెల్లం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో పటిక బెల్లం చక్కగా పని చేస్తుంది. ఇంకా శరీరాన్ని చల్ల పరుస్తుంది కూడా. పటిక బెల్లాన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ముందుగా స్టవ్‌పై ఒక కడాయి పెట్టి దానిలో రెండు స్పూన్ల నెయ్యి ను వేడి చేసి అందులో రెండు స్పూన్ల గసగసాలు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ పాలను వేసి మరగనివ్వాలి. అందులో ఒక అంగుళం ఎండు కొబ్బరిని వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఒక స్పూన్ సొంపు వేసి ఒక పొంగు వచ్చాక పటిక బెల్లం వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఈ పాలను రోజు తప్పించి రోజు వారానికి 3 సార్లు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపం నుండి బయట పడవచ్చు. వెన్నునొప్పి కాళ్ల నొప్పి నడుము నొప్పులు కూడా తగ్గుతాయి.