Site icon HashtagU Telugu

Health Benefits: కాలి బొటనవేలుపై వెంట్రుకలు ఎక్కువగా వస్తున్నాయా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Mixcollage 04 Jan 2024 04 43 Pm 373

Mixcollage 04 Jan 2024 04 43 Pm 373

మామూలుగా మన శరీరంలో అనేక ప్రదేశాలలో వెంట్రుకలు రావడం అన్నది సహజం. చేతులకు కాళ్లకు,అండర్ ఆర్మ్స్, తల,మీసాలు,గడ్డాలు చెవులకు ఇలా అనేక ప్రదేశాలలో వెంట్రుకలు వస్తూ ఉంటాయి. అయితే కొంతమందికి కాళీ బొటన వేలు పై కూడా వెంట్రుకలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఎంత కట్ చేసుకున్నప్పటికీ అవి పదేపదే వస్తూనే ఉంటాయి. ఒక వేళ కాలి బొటన వేళ్లపై జుట్టు రాకపోతే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయట. కాలి వెంట్రుకలను గుండె జబ్బుకు సంబంధి ఏమిటా అని అనుకుంటున్నారా. అయితే ఇది తెలుసుకోవాల్సిందే. కొంత మందికి కాలి బొటన వేలులో వెంట్రుకలు పెరగవు. ఎందుకంటే రక్తం నుంచి పోషకాలు సరిగా అందవు.

అలా అందకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే రక్తాన్ని సరఫరా చేసే నాళాలైన ధమనుల్లో ఆటంకం ఏర్పడడమే. సాధారణంగా మనం తినే ఆహారం ద్వారా మన శరీరంలో ఎంతో కొంత కొవ్వు పేరుకుపోతుంది. అలా ధమనుల్లో మొత్తంలో పేరుకుపోయే కొవ్వు ముందుగా చేరేది ధమనుల్లోనే. ఈ క్రమంలో ధమనుల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల రక్తం సరఫరా సరిగ్గా జరగదు. దీంతో పోషకాలు కూడా సరిగ్గా అందక వెంట్రుకలు పెరగవు. కాలి బొటన వేలిపై వెంట్రుకలను పెరగకపోతే గుండె జబ్బులు వస్తాయని వైద్యులు అంటారు. తల, చేతులపై వెంట్రుకలు వచ్చినా రాకపోయినా వాటిని గుండె జబ్బులకు కారణంగా తీసుకోకూడదు.

కాలి బటన వేలినే ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి అంటే.. కాలి బొటన వేలినే లెక్కలోకి తీసుకోవాలి. ఎందుకంటే తల, చేతులు గుండెకు చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి గుండె నుంచి వచ్చే ప్రెషర్ తో రక్తం ఎలాగో వాటికి అందుతుంది. అందుకే వాటిని పరిగణనలోకి తీసుకోవద్దు. కానీ కాలు గుండెకు బాగా దూరంగా ఉంటుంది. కాబట్టి అక్కడి వరకు రక్తం సరఫరా కావాలంటే మామూలుగానే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే కాలి బొటన వేలిని లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచు కోవాల్సి ఉంటుంది. అదేమిటంటే కాలి బొటన వేలిపై ఉన్న వెంట్రుకలు బాగా పెరిగితే అక్కడ రక్తం సరఫరా సక్రంగా జరుగుతున్నట్లే భావించాలి.రక్త సరఫరా తలపై నుండి అరి కాలి వరకూ సక్రమంగా జరిగితే ఆరోగ్యంగా ఉన్నట్లు.అదే ఆ భాగంలో వెంట్రుకలు లేకపోతే రక్త ప్రసరణ సరిగ్గా కావడం లేదని అర్థం చేసుకోవాలి. దీంతో వారికి గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తి అవకాశాలు ఉంటాయని చెబుతారు.