Diabetes Symptoms : శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిలో హెచ్చుతగ్గుల వల్ల వచ్చే సమస్య మధుమేహం (Diabetes).. ఇది రెండు రకాలుగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. టైప్ 1, టైప్ 2 మధుమేహం. టైప్ 1 మధుమేహంలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిపడా లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోతాయి. ఉత్పత్తి అయిన ఇన్సులిన్ ను శరీరం సరిగా ఉపయోగించుకోలేకపోవడం వల్ల కలిగేది. టైప్ 2 మధుమేహం (Diabetes) సమస్య ఎదురవుతుంది. మధుమేహ బాధితులలో సాధారణంగా కనిపించే లక్షణాలు.. అధిక దాహం, అధిక ఆకలి, శక్తి కోల్పోవడం, బరువు తగ్గడం మొదలైనవి. అయితే, తాజాగా మధుమేహం బారిన పడుతున్న వారిలో కొత్త లక్షణాన్ని గుర్తించినట్లు నిపుణులు వెల్లడించారు. అది నోటి దుర్వాసన.. నోటిలో బాగా వాసన వస్తుందంటే మధుమేహానికి సంకేతమని, డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.
డయాబెటిస్ (Diabetes)ను కంట్రోల్ లో ఉంచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోవడం అన్నింటికన్నా ముఖ్యమని డాక్టర్లు సూచిస్తున్నారు. చక్కెర, ప్రాసెస్ చేసిన, ఆహారాలకు దూరంగా ఉండాలని, తాజా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. దీంతో పాటు క్రమం తప్పకుండా వాకింగ్, రన్నింగ్, యోగా, స్విమ్మింగ్ వంటి రోజువారీ వ్యాయామాలు చేయడం ద్వారా మధుమేహాన్ని అదుపు చేయవచ్చని నిపుణులు అంటున్నారు.
Also Read: Chakravyuham : ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘చక్రవ్యూహం’