Site icon HashtagU Telugu

Health Tips: మీకు నిద్ర లేవగానే నీరు తాగే అలవాటు ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Mixcollage 03 Dec 2023 08 45 Pm 6555

Mixcollage 03 Dec 2023 08 45 Pm 6555

మామూలుగా మనలో చాలామందికి ఉదయం నిద్ర లేవగానే నీటిని తాగే అలవాటు ఉంటుంది. కొందరు నార్మల్ వాటర్ తాగితే మరికొందరికి గోరువెచ్చని నీరు తాగుతూ ఉంటారు. అయితే ఇలా ఉదయాన్నే లేచి నీరు తాగడం అన్నది చాలా మంచి అలవాటు. ఇలా చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయం నిద్ర లేచిన వెంటనే నీటిని తాగడం అలవాటు చేసుకుంటే అది జీవ క్రియను పెంచి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అందుకోసం కనీసం రెండు గ్లాసులు నీటిని తీసుకోవాలి. అలాగే రాత్రంతా నిద్ర పోవడం వలన చాలా గంటల పాటు నీరు అందకుండా పోతుంది.

వేసవికాలంలో చాలామందికి నిద్ర పోయేటప్పుడు చెమట వస్తుంది. ఇది శరీరంలో నీటి కొరతను కలిగిస్తుంది. ప్రతి ఒక్కరు ఉదయం నిద్ర లేచిన వెంటనే నీరు తాగడానికి కారణం కూడా ఇదే. అలాగే ఎప్పుడైనా చర్మం డల్ గా మారినట్లు అనిపిస్తే నిద్రలేచిన వెంటనే మీరు తాగాలి. ఇలా నీరు తాగడం వల్ల రక్త ప్రసరణ ప్రోత్సహిస్తుంది. కొత్త కణాలు ఉత్పత్తిని పెంచడం వలన చర్మాన్ని మెరిసేలా చేస్తూ ఉంటుంది. ఉదయం పూట మొదటగా నీళ్లు తాగడం వలన కిడ్నీలోని రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉదయం పూట నీటిని తీసుకోవడం వల్ల కడుపులోని యాసిడ్ శాంతపరచి రాళ్ల అభివృద్ధిని తగ్గిస్తుంది.

అలాగే ఉదయం పూట నీటిని తీసుకోవడం వల్ల కడుపు నుంచి విషాన్ని బయటికి పంపిస్తుంది. ఇది సోషసర వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. కాలక్రమేనా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది మనిషిని మళ్లీ అనారోగ్యానికి గురి చేసే సమస్య నుంచి రక్షిస్తుంది. ఉదయాన్నే నీరు తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కూడా ఉండవు. మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారు ఉదయాన్నే నీరు తాగడం వల్ల ఫ్రీగా మోషన్ అవుతుంది.